తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 7, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు మొండి ధైర్యంతో అనుకున్నది సాధిస్తారు

మే 7, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వాళ్ళు మొండి ధైర్యంతో అనుకున్నది సాధిస్తారు

HT Telugu Desk HT Telugu

07 May 2024, 0:01 IST

  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 07.05.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 7వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 7వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

మే 7వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 07.05. 2024

లేటెస్ట్ ఫోటోలు

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

Lucky Zodiacs From May 19th : శుక్రాదిత్య యోగం.. వీరికి సంపద పరంగా భారీ లాభాలు.. ప్రేమ జీవితంలో అద్భుతాలు

May 19, 2024, 07:06 AM

Mercury transit: గ్రహాల రాకుమారుడు వచ్చేశాడు.. ఈ నెల అంతా వీరికి డబ్బే డబ్బు

May 18, 2024, 03:19 PM

Mohini Ekadashi : మోహిని ఏకాదశి రోజున ఈ రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

May 18, 2024, 08:31 AM

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

వారం: మంగళవారం, తిథి : చతుర్దశి,

నక్షత్రం : అశ్విని, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీ కుటుంబ విషయాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించండి. రుణదాతల నుండి ఒత్తిడి ఎదుర్కొంటారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియచేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు రావాలసిన అలవెన్సులు, ప్రమోషన్‌ ఆర్డర్లు చేతికందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా కోరుకోవటం మంచిది. రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. శ్రమాధిక్యత, వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకు పనులు, దూరప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. కూర, పండ్లు, కొబ్బరి, ధాన్య, స్టాక్ మార్కెట్ వారికి కలసివచ్చే కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. మధ్యలో నిలిపివేసిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్‌, టెలిగ్రాఫ్‌ రంగాలలో వారికి అనుకూలం. దూర ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. మరింత శుభ ఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. వినాయకుడిని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు విధి నిర్వహణలో ఇబ్బందులెదురవుతాయి. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత కుదురుతుంది. ఉద్యోగస్తులకు రావలసిన క్షయిములు మంజూరవుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. హోటల్‌, తినుబండారాలు, క్యాటరింగ్‌ పనివారలకు పురోభివృద్ధి. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ప్రింటింగ్‌ రంగాల వారికి చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలుంటాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. సంకటనాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. మీ కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. ఏకాగ్రత లోపించటం వల్ల విద్యార్థినులు ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. ప్రింటింగ్‌ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రేమికులు ఇతరుల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పెద్దల ఆహార, ఆరోగ్య విషయాల్లో మెళకువ వహించండి. కంపెనీ వ్యవహారాలు, వృత్తి వ్యాపారాల గురించి సన్నిహితులతో చర్చిస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. చిన్నతరహా పరిశ్రమల వారికి సదావకాశాలు లభిస్తాయి. మరింత శుభఫలితాలు పొందాలంటే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో అమ్మవారిని పూజించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. విజ్ఞతతో వ్యవహరించి రుణదాతలను సమాధానపరుస్తారు. దుబారా ఖర్చులు అధికం. దైవ సేవా కార్యక్రమాలలో చరుకుగా వ్యవహరిస్తారు. మీ అంతరంగిక, కుటుంబ సమస్యలు గోప్యంగా ఉంచండి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయం చేస్తారు. మరింత శుభఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ఆహార, ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం సాయంకాల సమయంలో అమ్మవారి వద్ద నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం మంచిది. ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన చేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు విదేశీ పర్యటనల కోసం చేసే ప్రయత్నాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. మీ పనులు కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో క్షణం తీరిక ఉండదు. కుంభ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలంటే విఘ్నేశ్వరుడిని పూజించాలి. సంకట నాశన గణపతి స్తోత్రం పఠించాలి. వినాయకుడి ఆలయంలో నువ్వతో నూనెతో దీపాలను వెలిగించడం మంచిది.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఆదాయ వ్యయాలు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో అశ్రద్ద పనికిరాదు. గృహ నిర్మాణాలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్మోవలసి వస్తుంది. బ్యాంకింగ్‌ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరున్ని పూజించండి. రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం