తెలుగు న్యూస్ / ఫోటో /
Narasimha Dwadashi 2024: మనదేశంలో ఉన్న ఈ ఆలయంలో ఏడాదిలో ఒకసారి మాత్రమే నరసింహ స్వామి దర్శనమిస్తారు
Narasimha Dwadashi 2024: ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని నరసింహ ద్వాదశి అని కూడా అంటారు. ఈ నెల తేదీ మార్చి 21న నరసింహ ద్వాదశి వస్తుంది. ఈ రోజున విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహ అవతారం ఎత్తాడు.
(1 / 5)
విష్ణువు నరసింహావతారాన్ని స్వీకరించి తన భక్తుడైన ప్రహ్లాదుని ప్రాణాలను కాపాడాడు. హిందూమతంలో విష్ణువు, ప్రహ్లాదుల కథ చాలా ముఖ్యమైనది. ధర్మం మీద అధర్మం ఆధిపత్యం చెలాయించినప్పుడల్లా విష్ణువు కొత్త అవతారాన్ని ఎత్తుతాడని అంటారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే నరసింహుని విగ్రహాన్ని దర్శించే ఆలయం ఒకటుంది.
(2 / 5)
నరసింహ స్వామి ఆలయాలు మనదేశంలో ఎన్నో ఉన్నాయి. విశాఖపట్నంలోని సింహాచలంలోని కొండపై ఉన్న ఆలయం చాలా ముఖ్యమైనది. ఇది దేశవ్యాప్తంగా సింహాచలం ఆలయంగా ప్రసిద్ధి చెందింది. సింహాచలం దేవాలయాన్ని నరసింహ స్వామి ఇల్లు అని కూడా అంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే నరసింహ స్వామి లక్ష్మీదేవి సమేతంగా కొలువై ఉంటాడు.
(3 / 5)
నరసింహ స్వామి సింహాచలంలో ఉన్న ఆలయంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శనమిస్తాడు, మిగతా ఏడాది పొడవునా గంధపు పేస్టును రాసుకుని ఉంటాడు. ఈ గంధం పేస్ట్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే తొలగిస్తారు. అక్షయ తృతీయ రోజున నరసింహుని విగ్రహానికి ఈ పేస్టును తొలగిస్తారు. ఆ పూతను తొలగించాక భక్తులు నరసింహ దేవుని విగ్రహాన్ని చూడగలరు. ఈ ఆలయాన్ని ప్రహ్లాదుడు కట్టాడని అంటారు. (Freepik)
(4 / 5)
పురాణాల ప్రకారం నరసింహుడు హిరణ్యకశ్యపుడిని సంహరించినప్పుడు భక్తుడైన ప్రహ్లాదుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఆ ఆలయం భూమి గర్భంలోకి మాయమవడంతో, పురూరవ మహారాజు స్వయంగా భూగర్భంలో ఉన్న నరసింహుని విగ్రహాన్ని బయటకు తీసుకువచ్చి, దానిని తిరిగి ప్రతిష్ఠించి గంధపు పూతతో కప్పాడని చెబుతారు. ఈ ఆలయాన్ని పురూరవ అనే రాజు పునర్నిర్మించాడు. ఈ విషయాన్ని సింహాచలం దేవస్థానం అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు.
(5 / 5)
పురాణాల ప్రకారం, హిరణ్యకశిపుని చంపినప్పుడు నరసింహుడు చాలా కోపగించుకున్నాడు. కాబట్టి అతని కోపాన్ని చల్లార్చడానికి గంధపు పేస్టును పూసేవారు. దానివల్ల అతని కోపం తగ్గుతుంది. అప్పటి నుంచి నరసింహుని విగ్రహానికి గంధపు పేస్టును పూయడం ఆనవాయితీగా వస్తోంది.ఈ గంధం పేస్టును సంవత్సరానికి ఒకసారి అక్షయ తృతీయ రోజున తొలగించడం ఆనవాయితీగా వస్తోంది. దీని తరువాత, ప్రజలు సంవత్సరానికి ఒకసారి మాత్రమే నిజమైన నరసింహ స్వామి విగ్రహాన్ని చూడగలరు.(Freepik)
ఇతర గ్యాలరీలు