తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Samsung Galaxy Watch5 And Watch5 Pro Flagship Smartwatches Launched

Galaxy Watch5 | శాంసంగ్ నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌లు.. ధర కూడా వాచిపోయింది!

10 August 2022, 20:47 IST

ఆగష్టు 10, 2022న జరిగిన Samsung Unpacked ఈవెంట్‌లో భాగంగా శాంసంగ్ కంపెనీ పలు ప్రొడక్టులను విడుదల చేసింది. ఇందులో Samsung Galaxy Watch5 అలాగే Galaxy Watch5 Pro అనే రెండు స్మార్ట్‌వాచ్‌లు కూడా ఉన్నాయి. వీటి ఫీచర్లు ఈ కింద చూడండి..

ఆగష్టు 10, 2022న జరిగిన Samsung Unpacked ఈవెంట్‌లో భాగంగా శాంసంగ్ కంపెనీ పలు ప్రొడక్టులను విడుదల చేసింది. ఇందులో Samsung Galaxy Watch5 అలాగే Galaxy Watch5 Pro అనే రెండు స్మార్ట్‌వాచ్‌లు కూడా ఉన్నాయి. వీటి ఫీచర్లు ఈ కింద చూడండి..

Galaxy Watch5 స్మార్ట్‌వాచ్‌ 40mm, 44mm రెండు పరిమాణాల్లో రాగా, Pro మోడల్ 45mm పరిమాణంలో ఒకే వేరియంట్‌లో వస్తుంది. తాజాగా విడుదలైన Galaxy Watch5 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లలో అదే 1.18GHz Exynos W920 ప్రాసెసర్‌, 1.5GB RAM ఇంకా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు.
(1 / 6)
Galaxy Watch5 స్మార్ట్‌వాచ్‌ 40mm, 44mm రెండు పరిమాణాల్లో రాగా, Pro మోడల్ 45mm పరిమాణంలో ఒకే వేరియంట్‌లో వస్తుంది. తాజాగా విడుదలైన Galaxy Watch5 సిరీస్ స్మార్ట్‌వాచ్‌లలో అదే 1.18GHz Exynos W920 ప్రాసెసర్‌, 1.5GB RAM ఇంకా 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు.(Samsung)
Galaxy Watch5ను శాంసంగ్ 'స్మార్ట్ స్విచ్' గా పిలుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ స్మార్ట్‌ఫోన్ నుండి స్మార్ట్ వాచ్‌ను సులభంగా సెటప్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా గెలాక్సీ వాచ్‌ని ఉపయోగించినట్లయితే, ఈ ఫీచర్ మీ మునుపటి సెట్టింగ్‌లను స్వయంచాలకంగా గుర్తిస్తుంది, తదనుగుణంగా మీ వాచ్‌ని సెటప్ చేస్తుంది.
(2 / 6)
Galaxy Watch5ను శాంసంగ్ 'స్మార్ట్ స్విచ్' గా పిలుస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ స్మార్ట్‌ఫోన్ నుండి స్మార్ట్ వాచ్‌ను సులభంగా సెటప్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా గెలాక్సీ వాచ్‌ని ఉపయోగించినట్లయితే, ఈ ఫీచర్ మీ మునుపటి సెట్టింగ్‌లను స్వయంచాలకంగా గుర్తిస్తుంది, తదనుగుణంగా మీ వాచ్‌ని సెటప్ చేస్తుంది.(Samsung)
Galaxy Watch5 సిరీస్‌లో 3-in-1 బయోయాక్టివ్ సెన్సార్‌ను అమర్చారు. ఇది ECGలు, హృదయ స్పందన రేటు, శరీర కూర్పు విశ్లేషణ వంటి వివరాలను ట్రాక్ చేయగలదు. ఈ వాచ్‌లో అంతర్నిర్మిత GPS, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, ఆప్షనల్ LTE ఇంకా బ్లూటూత్ 5.2 సపోర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లు ఉన్నాయి.
(3 / 6)
Galaxy Watch5 సిరీస్‌లో 3-in-1 బయోయాక్టివ్ సెన్సార్‌ను అమర్చారు. ఇది ECGలు, హృదయ స్పందన రేటు, శరీర కూర్పు విశ్లేషణ వంటి వివరాలను ట్రాక్ చేయగలదు. ఈ వాచ్‌లో అంతర్నిర్మిత GPS, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, ఆప్షనల్ LTE ఇంకా బ్లూటూత్ 5.2 సపోర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ ఫీచర్లు ఉన్నాయి.(Samsung)
Galaxy Watch5 సిరీస్‌ వాచ్‌లలో మీ నిద్ర దశలు, REM నిద్ర వ్యవధి, ఎంత సేపు గురకపెట్టారు వంటి మొత్తం మీ నిద్రకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేసే అధునాతన స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.
(4 / 6)
Galaxy Watch5 సిరీస్‌ వాచ్‌లలో మీ నిద్ర దశలు, REM నిద్ర వ్యవధి, ఎంత సేపు గురకపెట్టారు వంటి మొత్తం మీ నిద్రకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేసే అధునాతన స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.(Samsung)
Samsung Galaxy Watch5 స్మార్ట్‌వాచ్‌లలో బ్లూటూత్ వేరియంట్ ధర $279 కాగా, LTE వేరియంట్ కోసం ధర $329 ధర, అలాగే LTE వేరియంట్ కోసం ధర $499గా నిర్ణయించారు. (భారతీయ కరెన్సీ ప్రకారం ధరలు సుమారు రూ. 22 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉన్నాయి). గ్రాఫైట్, సిల్వర్, నీలమణి (Sapphire), పింక్ గోల్డ్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఆగస్టు 26 నుంచి విక్రయాలు ప్రారంభం.
(5 / 6)
Samsung Galaxy Watch5 స్మార్ట్‌వాచ్‌లలో బ్లూటూత్ వేరియంట్ ధర $279 కాగా, LTE వేరియంట్ కోసం ధర $329 ధర, అలాగే LTE వేరియంట్ కోసం ధర $499గా నిర్ణయించారు. (భారతీయ కరెన్సీ ప్రకారం ధరలు సుమారు రూ. 22 వేల నుంచి రూ. 40 వేల మధ్య ఉన్నాయి). గ్రాఫైట్, సిల్వర్, నీలమణి (Sapphire), పింక్ గోల్డ్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. ఆగస్టు 26 నుంచి విక్రయాలు ప్రారంభం.(Samsung)

    ఆర్టికల్ షేర్ చేయండి