తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బ్లూటూత్ కాలింగ్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర ఎంతంటే?

బ్లూటూత్ కాలింగ్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర ఎంతంటే?

HT Telugu Desk HT Telugu

30 June 2022, 19:37 IST

    • స్మార్ట్‌వాచ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. భారత మార్కెట్లో నాయిస్ స్మార్ట్ వాచ్‌లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌లో కూడా స్మార్ట్ ఫోన్ల మాదిరి ఫీచర్లతో ఉన్నాయి. ఈ వాచ్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 
Noise smart watch
Noise smart watch

Noise smart watch

నాయిస్ సంస్థ భారత్‌లో నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 , నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మాక్స్ అనే రెండు కొత్త స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు పెద్ద డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్‌తో పాటు 100 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉన్నాయి. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 ధర రూ.3,499 ఉండగా.. నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మ్యాక్స్ ధర రూ.3,999గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు జులై 4 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

World Hypertension Day 2024: ఇవి కూడా హైబీపీ లక్షణాలే, కానీ చాలా మందికి తెలియవు

Noise ColorFit Pro 4: ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు

నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 1.72-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ క్రౌన్‌ను కూడా కలిగి ఉంది, ఇది మెనులను స్క్రోల్ చేయడానికి, వాల్యూమ్‌ను సర్దుబాటు చేయడానికి, వాచ్ ఫేస్ మార్చడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో సైక్లింగ్, వాకింగ్, రన్నింగ్, హైకింగ్ వంటి 100 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఇందులో హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటర్ ఉన్నాయి.

Noise ColorFit Pro 4 Max: ఫీచర్లు. స్పెసిఫికేషన్‌లు

నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 4 మ్యాక్స్ 1.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. సైడ్ బటన్‌ను ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇది బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని కూడా పొందుతుంది. ఇది కూడా సైక్లింగ్, పూల్ స్విమ్మింగ్, వాకింగ్, రన్నింగ్, హైకింగ్ వంటి 100 స్పోర్ట్స్ మోడ్‌లకు సపొర్ట్ ఇస్తుంది. ఇందులో, హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్, స్లీప్ మానిటర్ వంటి ఆరోగ్య ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో IP68 రేటింగ్, 150+ వాచ్ ఫేస్‌లు, సౌండ్ డిటెక్షన్ ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం