తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ola Evs | 2024 నాటికి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనున్న ఓలా ఎలక్ట్రిక్..!

Ola EVs | 2024 నాటికి ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయనున్న ఓలా ఎలక్ట్రిక్..!

16 August 2022, 15:53 IST

ఓలా కంపెనీ Ola S1 scooter పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. 2024 నాటికి భారతదేశంలో 500 కి.మీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ తెలిపారు.

ఓలా కంపెనీ Ola S1 scooter పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది. 2024 నాటికి భారతదేశంలో 500 కి.మీ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ తెలిపారు.

ఎలక్ట్రిక్ టూవీలర్లను ఆవిష్కరించిన ఓలా కంపెనీ, ఇక ఫోర్ వీలర్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించనుంది. 2024 నాటికి భారతదేశంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు Ola వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ ప్రకటించారు.
(1 / 11)
ఎలక్ట్రిక్ టూవీలర్లను ఆవిష్కరించిన ఓలా కంపెనీ, ఇక ఫోర్ వీలర్ సెగ్మెంట్లోకి కూడా ప్రవేశించనుంది. 2024 నాటికి భారతదేశంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు Ola వ్యవస్థాపకుడు, CEO భవిష్ అగర్వాల్ ప్రకటించారు.(Twitter)
ఆగష్టు 14, 2022న తమిళనాడులోని కృష్ణగిరిలోని ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో జరిగిన కస్టమర్ ఈవెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. 
(2 / 11)
ఆగష్టు 14, 2022న తమిళనాడులోని కృష్ణగిరిలోని ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో జరిగిన కస్టమర్ ఈవెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. (Twitter)
అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఓలా ఎలక్ట్రిక్ కారు కేవలం నాలుగు సెకన్లలోనే 0 - 100 KMPH వేగాన్ని అందుకోగలదు.
(3 / 11)
అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఓలా ఎలక్ట్రిక్ కారు కేవలం నాలుగు సెకన్లలోనే 0 - 100 KMPH వేగాన్ని అందుకోగలదు.(Twitter)
ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి ప్రవేశించిన ఓలా ఎలక్ట్రిక్.. టూవీలర్స్ లాంచ్ తర్వాత ఇప్పుడు ఫోర్-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 70-80kWh బ్యాటరీ, పూర్తి LED లైట్లు , ఏరోడైనమిక్ డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ సెడాన్‌ టీజర్ చిత్రాన్ని ఓలా విడుదల చేసింది.
(4 / 11)
ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలోకి ప్రవేశించిన ఓలా ఎలక్ట్రిక్.. టూవీలర్స్ లాంచ్ తర్వాత ఇప్పుడు ఫోర్-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 70-80kWh బ్యాటరీ, పూర్తి LED లైట్లు , ఏరోడైనమిక్ డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ సెడాన్‌ టీజర్ చిత్రాన్ని ఓలా విడుదల చేసింది.(Twitter)
'ఓలా ఎస్1 ప్రో' బైక్ మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్ ఖాకీ కలర్ వేరియంట్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. 1947లో భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటూ కొత్త వేరియంట్ కేవలం 1947 యూనిట్లు మాత్రమే అందించనున్నారు
(5 / 11)
'ఓలా ఎస్1 ప్రో' బైక్ మోడళ్లలో లిమిటెడ్ ఎడిషన్ ఖాకీ కలర్ వేరియంట్‌ను కూడా విడుదల చేస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. 1947లో భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్రాన్ని స్మరించుకుంటూ కొత్త వేరియంట్ కేవలం 1947 యూనిట్లు మాత్రమే అందించనున్నారు(Twitter)
తాజాగా విడుదలైన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్లను రూ. 99,999 ప్రారంభ ధరతో విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది.
(6 / 11)
తాజాగా విడుదలైన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్లను రూ. 99,999 ప్రారంభ ధరతో విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది.
Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది, అవి ఎకో, స్పోర్ట్స్ ఇంకా నార్మల్ మోడ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 128 కిమీ, సాధారణ మోడ్‌లో 101 కిమీ అలాగే స్పోర్ట్స్ మోడ్‌లో 90 కిమీలు దూరం వెళ్లగలవు.
(7 / 11)
Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది, అవి ఎకో, స్పోర్ట్స్ ఇంకా నార్మల్ మోడ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 128 కిమీ, సాధారణ మోడ్‌లో 101 కిమీ అలాగే స్పోర్ట్స్ మోడ్‌లో 90 కిమీలు దూరం వెళ్లగలవు.(Ola Electric)
Ola S1లో 3 KWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ మీద 90 కిమీ - 128 కిమీల రేంజ్ లభిస్తుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 95 కి.మీ
(8 / 11)
Ola S1లో 3 KWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ ఛార్జ్ మీద 90 కిమీ - 128 కిమీల రేంజ్ లభిస్తుంది. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 95 కి.మీ
ఓలా ఎలక్ట్రిక్ S1 స్కూటర్ 5 విభిన్న రంగులలో లభిస్తుంది. అవి జెట్ బ్లాక్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్, పోర్సిలియన్ వైట్, నియో మింట్
(9 / 11)
ఓలా ఎలక్ట్రిక్ S1 స్కూటర్ 5 విభిన్న రంగులలో లభిస్తుంది. అవి జెట్ బ్లాక్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్, పోర్సిలియన్ వైట్, నియో మింట్(Twitter)
తమిళనాడులోని తమ కొత్త ఫ్యాక్టరీలోనే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తున్నట్లు ఓలా ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కార్లు, 10 మిలియన్ ద్విచక్ర వాహనాలు అలాగే 100 గిగావాట్ గంటల సెల్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.
(10 / 11)
తమిళనాడులోని తమ కొత్త ఫ్యాక్టరీలోనే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తున్నట్లు ఓలా ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కార్లు, 10 మిలియన్ ద్విచక్ర వాహనాలు అలాగే 100 గిగావాట్ గంటల సెల్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది.(Twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి