తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Habits | ఈ అలవాట్లతో చలికాలం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు!

Healthy Habits | ఈ అలవాట్లతో చలికాలం గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చు!

11 February 2022, 18:45 IST

శీతాకాలంలో ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే కొన్ని అలవాట్లు అలవాటు చేసుకోవాలని ఫోర్టిస్ హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ జాకియా ఖాన్ చెబుతున్నారు. 

  • శీతాకాలంలో ఆకస్మిక గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే కొన్ని అలవాట్లు అలవాటు చేసుకోవాలని ఫోర్టిస్ హాస్పిటల్ లో కార్డియాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ జాకియా ఖాన్ చెబుతున్నారు. 
శీతాకాలంలో హఠాత్తుగా గుండెపోటు సంభవించే కేసులు పెరుగుతున్నాయి. చల్లటిగాలులతో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పడుపోతుంది. ఇలా జరిగినపుడు నాడీ వ్యవస్థపై కాటెకోలమైన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తనాళాల సంకోచానికి దారితీస్తుంది. దీంతో మన హృదయ స్పందన రేటు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో రక్తం గడ్డకట్టే ఆస్కారం ఉంటుంది. ఈ కారకాలన్నీ చివరికి గుండెపోటుకు దారితీస్తాయి. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే మంచి నిద్ర, ఇండోర్ వ్యాయామాలు, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మొదలగు జీవనశైలి మార్పులను డాక్టర్ జకియా ఖాన్ సూచిస్తున్నారు.
(1 / 10)
శీతాకాలంలో హఠాత్తుగా గుండెపోటు సంభవించే కేసులు పెరుగుతున్నాయి. చల్లటిగాలులతో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పడుపోతుంది. ఇలా జరిగినపుడు నాడీ వ్యవస్థపై కాటెకోలమైన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తనాళాల సంకోచానికి దారితీస్తుంది. దీంతో మన హృదయ స్పందన రేటు, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. శరీరంలో రక్తం గడ్డకట్టే ఆస్కారం ఉంటుంది. ఈ కారకాలన్నీ చివరికి గుండెపోటుకు దారితీస్తాయి. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే మంచి నిద్ర, ఇండోర్ వ్యాయామాలు, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం మొదలగు జీవనశైలి మార్పులను డాక్టర్ జకియా ఖాన్ సూచిస్తున్నారు.(Pixabay)
Limit Alcohol: వెచ్చగా ఉండటానికి కొంతమంది మద్యం సేవిస్తారు కానీ.. మద్యపానం, ధూమపానం శీతాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నాటకీయంగా పెంచుతాయి. కాబట్టి అతిగా మద్యపానం, ధూమపానం మానుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
(2 / 10)
Limit Alcohol: వెచ్చగా ఉండటానికి కొంతమంది మద్యం సేవిస్తారు కానీ.. మద్యపానం, ధూమపానం శీతాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని నాటకీయంగా పెంచుతాయి. కాబట్టి అతిగా మద్యపానం, ధూమపానం మానుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.(Pixabay)
Manage your stress: అనేక గుండె జబ్బులకు ఒత్తిడితో కూడిన జీవనం కూడా ఒక ముఖ్య కారకం. అధిక ఒత్తిడి గుండెపోటుకు దారి తీయవచ్చు. దీర్ఘకాలికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటే అది గుండె ధమనుల లోపలి పొరలో మార్పులకు కారణమవుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టడంతోపాటు, గుండెపోటుకు దారితీస్తుంది.
(3 / 10)
Manage your stress: అనేక గుండె జబ్బులకు ఒత్తిడితో కూడిన జీవనం కూడా ఒక ముఖ్య కారకం. అధిక ఒత్తిడి గుండెపోటుకు దారి తీయవచ్చు. దీర్ఘకాలికంగా ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటే అది గుండె ధమనుల లోపలి పొరలో మార్పులకు కారణమవుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టడంతోపాటు, గుండెపోటుకు దారితీస్తుంది.(Pixabay)
Engage in hobbies: గార్డెనింగ్, పెయింటింగ్, బుక్స్ చదవడం, సంగీతం వినడం మొదలగు అభిరుచులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇంట్లో యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభించి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
(4 / 10)
Engage in hobbies: గార్డెనింగ్, పెయింటింగ్, బుక్స్ చదవడం, సంగీతం వినడం మొదలగు అభిరుచులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇంట్లో యోగా, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభించి సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది.(Pixabay)
Get a good night's sleep: రాత్రిపూట మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే ఏదైనా పనిని ఏకధాటిగా చేస్తూపోకుండా మధ్యమధ్యలో తప్పకుండా విరామాలు తీసుకోండి.
(5 / 10)
Get a good night's sleep: రాత్రిపూట మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే ఏదైనా పనిని ఏకధాటిగా చేస్తూపోకుండా మధ్యమధ్యలో తప్పకుండా విరామాలు తీసుకోండి.(Pixabay)
Daily exercise: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అయితే బాగా చలిగా ఉన్నప్పుడు బయట వ్యాయామాలు చేయడం వద్దు. బదులుగా స్టాటిక్ సైక్లింగ్, ట్రెడ్‌మిల్, యోగా మొదలైన ఇండోర్ వ్యాయామాలను ఎంచుకోండి.
(6 / 10)
Daily exercise: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అయితే బాగా చలిగా ఉన్నప్పుడు బయట వ్యాయామాలు చేయడం వద్దు. బదులుగా స్టాటిక్ సైక్లింగ్, ట్రెడ్‌మిల్, యోగా మొదలైన ఇండోర్ వ్యాయామాలను ఎంచుకోండి.(Pixabay)
Avoid excessive salt and sweets : అధిక ఉప్పు, తీపి ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. కుసుమపువ్వు నూనె, ఆవ నూనె మొదలగు పాలీఅన్ సాచురేటెడ్ నూనెలను వంటల్లో ఉపయోగించండి. పండ్లు, సలాడ్లు ఎక్కువగా తీసుకుంటుండండి.
(7 / 10)
Avoid excessive salt and sweets : అధిక ఉప్పు, తీపి ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. కుసుమపువ్వు నూనె, ఆవ నూనె మొదలగు పాలీఅన్ సాచురేటెడ్ నూనెలను వంటల్లో ఉపయోగించండి. పండ్లు, సలాడ్లు ఎక్కువగా తీసుకుంటుండండి.(Pixabay)
 Regular monitoring: రక్తంలో గ్లూకోజ్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోండి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
(8 / 10)
 Regular monitoring: రక్తంలో గ్లూకోజ్, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోండి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.(Pixabay)
Water: అవసరం మేరకే నీరు తాగాలి! చలికాలంలో చెమట తక్కువగా పడుతుంది, కాబట్టి శరీరం నుండి నీరు బయటకు వెళ్లదు. కాబట్టి నీరు, లేదా ఇతర పానీయాలేవైనా తగినంత మాత్రమే తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారు రోజులో ఎంత నీరు తీసుకోవాలి అనే దానిపై వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు.
(9 / 10)
Water: అవసరం మేరకే నీరు తాగాలి! చలికాలంలో చెమట తక్కువగా పడుతుంది, కాబట్టి శరీరం నుండి నీరు బయటకు వెళ్లదు. కాబట్టి నీరు, లేదా ఇతర పానీయాలేవైనా తగినంత మాత్రమే తీసుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారు రోజులో ఎంత నీరు తీసుకోవాలి అనే దానిపై వైద్యుడ్ని సంప్రదిస్తే మేలు.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి