తెలుగు న్యూస్  /  ఫోటో  /  Skin Care | వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

Skin Care | వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

06 April 2022, 18:47 IST

కాలమేదైనా చర్మానికి సరైన పోషణ, సంరక్షణ అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోత, చెమట కారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు, మొటిమలు ఏర్పడతాయి. నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి..

  • కాలమేదైనా చర్మానికి సరైన పోషణ, సంరక్షణ అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో ఉక్కపోత, చెమట కారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లు, మొటిమలు ఏర్పడతాయి. నిపుణుల సలహాలు ఇలా ఉన్నాయి..
వేసవి కాలంలో చర్మంపై చెమట, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, పొక్కులు ఏర్పడటానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబైకి చెందిన డాక్టర్ వందన (MBBS, DVD) వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి..ఏం చేయకూడదో సూచిస్తున్నారు.
(1 / 8)
వేసవి కాలంలో చర్మంపై చెమట, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు, పొక్కులు ఏర్పడటానికి ఆస్కారం ఎక్కువ. కాబట్టి చర్మానికి ప్రత్యేక సంరక్షణ అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబైకి చెందిన డాక్టర్ వందన (MBBS, DVD) వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలి..ఏం చేయకూడదో సూచిస్తున్నారు.(Pixabay)
హైడ్రేటెడ్ గా ఉండండి: ఆరోగ్యకరమైన చర్మానికి నీరు కీలకం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. సహజంగానే ఆరోగ్యకరమైన రూపాన్ని ఇస్తుంది.
(2 / 8)
హైడ్రేటెడ్ గా ఉండండి: ఆరోగ్యకరమైన చర్మానికి నీరు కీలకం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. సహజంగానే ఆరోగ్యకరమైన రూపాన్ని ఇస్తుంది.(Pixabay)
ఆరోగ్యకరమైన ఆహారం: ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. తినే భోజనంలో ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి. పచ్చి టమోటాలు, తాజా పండ్లను తినడానికి ప్రయత్నించండి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి.
(3 / 8)
ఆరోగ్యకరమైన ఆహారం: ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. తినే భోజనంలో ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి. పచ్చి టమోటాలు, తాజా పండ్లను తినడానికి ప్రయత్నించండి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడతాయి.(Pixabay)
ముఖాన్ని తరచూ కడుక్కోవడం: ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో దుమ్ము పేరుకొని ఉంటుంది, కాబట్టి రోజులో రెండు మూడుసార్లు ముఖాన్ని కడుగుతూ ఉండాలి. బయటకు వెళ్తే ముఖానికి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మంచిది.
(4 / 8)
ముఖాన్ని తరచూ కడుక్కోవడం: ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతుంది. దీంతో దుమ్ము పేరుకొని ఉంటుంది, కాబట్టి రోజులో రెండు మూడుసార్లు ముఖాన్ని కడుగుతూ ఉండాలి. బయటకు వెళ్తే ముఖానికి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మంచిది.(Unsplash)
ఎండాకాలంలో సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. సన్‌స్క్రీన్, సన్‌బర్న్ లోషన్లు వాడాలి.
(5 / 8)
ఎండాకాలంలో సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన UV కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. సన్‌స్క్రీన్, సన్‌బర్న్ లోషన్లు వాడాలి.(Unsplash)
ధూమపానం చేయవద్దు: ధూమపానం చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఇది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన పోషకాలు, విటమిన్లను కూడా తగ్గిస్తుంది.
(6 / 8)
ధూమపానం చేయవద్దు: ధూమపానం చర్మానికి చాలా హాని కలిగిస్తుంది. ఇది వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది.ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన పోషకాలు, విటమిన్లను కూడా తగ్గిస్తుంది.(Unsplash)
వేసవిలో చర్మంపై నూనె స్రావాలు ఎక్కువగా ఊరుతాయి. దీంతో మొటిమలు ఏర్పడవచ్చు. అయితే ఆ మొటిమలను గోటితో తాకవద్దు. అలాచేస్తే ముఖంపై మచ్చలు అలాగే ఉండిపోతాయి.
(7 / 8)
వేసవిలో చర్మంపై నూనె స్రావాలు ఎక్కువగా ఊరుతాయి. దీంతో మొటిమలు ఏర్పడవచ్చు. అయితే ఆ మొటిమలను గోటితో తాకవద్దు. అలాచేస్తే ముఖంపై మచ్చలు అలాగే ఉండిపోతాయి.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి