తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

15 July 2023, 10:05 IST

World Kebab Day 2023: ఈరోజు ప్రపంచ కబాబ్ దినోత్సవం, ఈ సందర్భంగాఅ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఏయే కబాబ్‌లు ప్రాచుర్యం పొందాయి, వాటి రుచుల ప్రత్యేకతను ఇక్కడ తెలుసుకోండి.

World Kebab Day 2023: ఈరోజు ప్రపంచ కబాబ్ దినోత్సవం, ఈ సందర్భంగాఅ భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఏయే కబాబ్‌లు ప్రాచుర్యం పొందాయి, వాటి రుచుల ప్రత్యేకతను ఇక్కడ తెలుసుకోండి.
భారతదేశంలో చాలా చోట్ల వివిధ రకాలైన కబాబ్‌ వంటకాలు ప్రసిద్ధి. రుచికరమైన కబాబ్‌లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కబాబ్‌ల రంగు, రుచి చూస్తేనే నోరూరుతుంది. మీరు తప్పక ప్రయత్నించవలసిన కొన్ని కబాబ్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి. 
(1 / 7)
భారతదేశంలో చాలా చోట్ల వివిధ రకాలైన కబాబ్‌ వంటకాలు ప్రసిద్ధి. రుచికరమైన కబాబ్‌లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కబాబ్‌ల రంగు, రుచి చూస్తేనే నోరూరుతుంది. మీరు తప్పక ప్రయత్నించవలసిన కొన్ని కబాబ్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి. (Unsplash)
గలూటీ కబాబ్ (లక్నో, ఉత్తరప్రదేశ్): లక్నోలోని రాయల్ కిచెన్‌ల నుండి ఉద్భవించిన గలూటీ కబాబ్,  కరిగిపోయే ఆకృతికి ప్రసిద్ధి చెందింది.  మాంసం కీమా, సుగంధ ద్రవ్యాలు, టెండరైజింగ్ ఏజెంట్ల ప్రత్యేక మిశ్రమంతో తయారు చేసే ఈ కబాబ్‌లు పుదీనా చట్నీతో వడ్డిస్తారు. 
(2 / 7)
గలూటీ కబాబ్ (లక్నో, ఉత్తరప్రదేశ్): లక్నోలోని రాయల్ కిచెన్‌ల నుండి ఉద్భవించిన గలూటీ కబాబ్,  కరిగిపోయే ఆకృతికి ప్రసిద్ధి చెందింది.  మాంసం కీమా, సుగంధ ద్రవ్యాలు, టెండరైజింగ్ ఏజెంట్ల ప్రత్యేక మిశ్రమంతో తయారు చేసే ఈ కబాబ్‌లు పుదీనా చట్నీతో వడ్డిస్తారు. (Shutterstock)
సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ,  నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు. 
(3 / 7)
సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ,  నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు. (Pinterest)
షామీ కబాబ్ (హైదరాబాద్, తెలంగాణ): షామీ కబాబ్‌లు హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందాయి.  వీటిని మటన్ కీమా, కాయధాన్యాలు,  మసాలాలతో తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని పట్టీలుగా చేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ కబాబ్‌లు మృదువైన,  వెల్వెట్ ఆకృతికి ప్రసిద్ధి చెందాయి. 
(4 / 7)
షామీ కబాబ్ (హైదరాబాద్, తెలంగాణ): షామీ కబాబ్‌లు హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందాయి.  వీటిని మటన్ కీమా, కాయధాన్యాలు,  మసాలాలతో తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని పట్టీలుగా చేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ కబాబ్‌లు మృదువైన,  వెల్వెట్ ఆకృతికి ప్రసిద్ధి చెందాయి. (Pinterest)
తంగ్డీ కబాబ్ (పంజాబ్): తంగ్డీ కబాబ్, దీనిని చికెన్ డ్రమ్ స్టిక్ కబాబ్ అని కూడా పిలుస్తారు, ఇది పంజాబీల ప్రత్యేక రెసిపీ. చికెన్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి,  గరం మసాలాతో సహా పెరుగు,  సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మెరినేట్ చేసి, ఆపై గ్రిల్ లేదా బేక్ చేసి చేస్తారు. టాంగ్డీ కబాబ్‌లు సువాసనగా, చాలా రుచికరంగా ఉంటాయి. 
(5 / 7)
తంగ్డీ కబాబ్ (పంజాబ్): తంగ్డీ కబాబ్, దీనిని చికెన్ డ్రమ్ స్టిక్ కబాబ్ అని కూడా పిలుస్తారు, ఇది పంజాబీల ప్రత్యేక రెసిపీ. చికెన్ ముక్కలు, అల్లం, వెల్లుల్లి,  గరం మసాలాతో సహా పెరుగు,  సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మెరినేట్ చేసి, ఆపై గ్రిల్ లేదా బేక్ చేసి చేస్తారు. టాంగ్డీ కబాబ్‌లు సువాసనగా, చాలా రుచికరంగా ఉంటాయి. (Pinterest)
హరా భరా కబాబ్ (ముంబయి, మహారాష్ట్ర): మీరు శాకాహార కబాబ్‌లను ఇష్టపడితే, హరా భరా కబాబ్ మీకు ఒక సంతోషకరమైన రెసిపీ. పాలకూర, బఠానీలు, బంగాళాదుంపలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసే ఈ ఆకుపచ్చ-రంగు కబాబ్‌లను  పాన్-ఫ్రైడ్ లేదా బేక్ చేసి చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీతో  వడ్డిస్తారు. 
(6 / 7)
హరా భరా కబాబ్ (ముంబయి, మహారాష్ట్ర): మీరు శాకాహార కబాబ్‌లను ఇష్టపడితే, హరా భరా కబాబ్ మీకు ఒక సంతోషకరమైన రెసిపీ. పాలకూర, బఠానీలు, బంగాళాదుంపలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసే ఈ ఆకుపచ్చ-రంగు కబాబ్‌లను  పాన్-ఫ్రైడ్ లేదా బేక్ చేసి చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీతో  వడ్డిస్తారు. (Pinterest )
తందూరి పనీర్ టిక్కా (ఉత్తర భారతదేశం): తందూరి పనీర్ టిక్కా అనేది పెరుగు, మసాలాల మిశ్రమంలో మ్యారినేట్ చేసిన పనీర్  ముక్కలతో తయారు చేసే ఒక ప్రసిద్ధ శాఖాహార కబాబ్. మ్యారినేట్ చేసిన పనీర్‌ను తందూరీ (మట్టి ఓవెన్) లేదా గ్రిల్‌లో కాల్చి చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ రింగులతో వడ్డిస్తారు.
(7 / 7)
తందూరి పనీర్ టిక్కా (ఉత్తర భారతదేశం): తందూరి పనీర్ టిక్కా అనేది పెరుగు, మసాలాల మిశ్రమంలో మ్యారినేట్ చేసిన పనీర్  ముక్కలతో తయారు చేసే ఒక ప్రసిద్ధ శాఖాహార కబాబ్. మ్యారినేట్ చేసిన పనీర్‌ను తందూరీ (మట్టి ఓవెన్) లేదా గ్రిల్‌లో కాల్చి చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ రింగులతో వడ్డిస్తారు.(Pinterest)

    ఆర్టికల్ షేర్ చేయండి