తెలుగు న్యూస్  /  Photo Gallery  /  In Pics, List Of Waiting Periods For All Subcompact Suvs In Various Major Cities Of India

SUV's waiting period : ఈ ఎస్​యూవీలకు వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువే!

06 March 2023, 8:41 IST

SUV's waiting period : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీలు రయ్​రయ్​మంటూ దూసుకుపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్​యూవీల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త ఎస్​యూవీలను లాంచ్​ చేస్తున్నాయి. కానీ డిమాండ్​ను అందుకోలేకపోతున్నాయి. ఫలితంగా పలు మోడల్స్​కు వెయిటింగ్​ పీరియడ్​ విపరీతంగా పెరిగిపోతోంది. 

  • SUV's waiting period : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీలు రయ్​రయ్​మంటూ దూసుకుపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్​యూవీల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త ఎస్​యూవీలను లాంచ్​ చేస్తున్నాయి. కానీ డిమాండ్​ను అందుకోలేకపోతున్నాయి. ఫలితంగా పలు మోడల్స్​కు వెయిటింగ్​ పీరియడ్​ విపరీతంగా పెరిగిపోతోంది. 
కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది సోనెట్​. ఢిల్లీలో కియా సోనెట్​కు 2 నెలలు, బెంగళూరులో 3 నెలలు, ముంబైలో 3-4 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. హైదరాబాద్​లో 4 నెలల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది.
(1 / 6)
కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది సోనెట్​. ఢిల్లీలో కియా సోనెట్​కు 2 నెలలు, బెంగళూరులో 3 నెలలు, ముంబైలో 3-4 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. హైదరాబాద్​లో 4 నెలల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది.
నిస్సాన్​ మాగ్నైట్​ మోడల్​కి కూడా మంచి డిమాండే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మాగ్నైట్​కు 2 వారాల వెయిటింగ్​ పీరియడే నడుస్తోంది. కానీ బెంగళూరులో 1.5 నెలలు, ముంబైలో 2-3 వారాల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది. ఇక హైదరాబాద్​లో ఈ వెహికిల్​కు 1 నెల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. 
(2 / 6)
నిస్సాన్​ మాగ్నైట్​ మోడల్​కి కూడా మంచి డిమాండే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మాగ్నైట్​కు 2 వారాల వెయిటింగ్​ పీరియడే నడుస్తోంది. కానీ బెంగళూరులో 1.5 నెలలు, ముంబైలో 2-3 వారాల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది. ఇక హైదరాబాద్​లో ఈ వెహికిల్​కు 1 నెల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. (HT AUTO)
హ్యుందాయ్​ వెన్యూకు ఢిల్లీలో 3 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. బెంగళూరులో 2-3 నెలలు, ముంబైలో 2 నెల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. హైదరాబాద్​లో 1-1.5 నెలల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది. 
(3 / 6)
హ్యుందాయ్​ వెన్యూకు ఢిల్లీలో 3 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. బెంగళూరులో 2-3 నెలలు, ముంబైలో 2 నెల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. హైదరాబాద్​లో 1-1.5 నెలల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది. (HT AUTO)
మరో డిమాండ్​ ఉన్న ఎస్​యూవీ.. ఎక్స్​యూవీ300కి ఢిల్లీలో ఏకంగా 3 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. బెంగళూరులో 2-3 నెలలు, ముంబైలో 3-4 నెలల పాటు వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. హైదరాబాద్​లో ఏకంగా 6 నెలల వరకు వెయిటింగ్​ పీరియడం ఉండటం గమనార్హం. 
(4 / 6)
మరో డిమాండ్​ ఉన్న ఎస్​యూవీ.. ఎక్స్​యూవీ300కి ఢిల్లీలో ఏకంగా 3 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. బెంగళూరులో 2-3 నెలలు, ముంబైలో 3-4 నెలల పాటు వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. హైదరాబాద్​లో ఏకంగా 6 నెలల వరకు వెయిటింగ్​ పీరియడం ఉండటం గమనార్హం. (HT AUTO)
మారుతీ బ్రెజాకు ఢిల్లీలో 2-3 నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. బెంగళూరులో అది 2 నెలలుగాను, ముంబైలో 2-3 నెలలుగాను ఉంది. ఇక హైదరాబాద్​లో కూడా 2.5 నుంచి 3 నెలల పాటు వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. 
(5 / 6)
మారుతీ బ్రెజాకు ఢిల్లీలో 2-3 నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. బెంగళూరులో అది 2 నెలలుగాను, ముంబైలో 2-3 నెలలుగాను ఉంది. ఇక హైదరాబాద్​లో కూడా 2.5 నుంచి 3 నెలల పాటు వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. (HT AUTO)
టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న నెక్సాన్​కు ఢిల్లీలో 2 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. ముంబైలో అది 1.5 నెలలుగాను, బెంగళూరులో 1-2 నెలలుగా ఉంది. హైదరాబాద్​లో ఏకంగా 4-5 నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది.
(6 / 6)
టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న నెక్సాన్​కు ఢిల్లీలో 2 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. ముంబైలో అది 1.5 నెలలుగాను, బెంగళూరులో 1-2 నెలలుగా ఉంది. హైదరాబాద్​లో ఏకంగా 4-5 నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి