తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brazil Riots : నాడు యూఎస్​ 'క్యాపిటల్​'- నేడు బ్రెజిల్​ 'కాంగ్రెస్​'.. ప్రజాస్వామ్యంపై దాడి!

Brazil Riots : నాడు యూఎస్​ 'క్యాపిటల్​'- నేడు బ్రెజిల్​ 'కాంగ్రెస్​'.. ప్రజాస్వామ్యంపై దాడి!

09 January 2023, 8:10 IST

Brazil Riots today : ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు! బ్రెజిల్​లో.. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. నేషనల్​ కాంగ్రెస్​లోకి చొచ్చుకెళ్లి.. హింసకు పాల్పడ్డారు. ఈ పరిణామాలు.. యూఎస్​ 'క్యాపిటల్​' హింసాకాండను గుర్తుచేస్తున్నాయి. 2021 జనవరి 6న.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు.. క్యాపిటల్​ భవనంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు.

  • Brazil Riots today : ప్రజాస్వామ్యంలో మరో చీకటి రోజు! బ్రెజిల్​లో.. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. నేషనల్​ కాంగ్రెస్​లోకి చొచ్చుకెళ్లి.. హింసకు పాల్పడ్డారు. ఈ పరిణామాలు.. యూఎస్​ 'క్యాపిటల్​' హింసాకాండను గుర్తుచేస్తున్నాయి. 2021 జనవరి 6న.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మద్దతుదారులు.. క్యాపిటల్​ భవనంలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు.
అధ్యక్షుడి భవనం ప్లనాల్టో ప్యాలెస్​లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. వారిపై పోలీసులు భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.
(1 / 8)
అధ్యక్షుడి భవనం ప్లనాల్టో ప్యాలెస్​లోకి ఆందోళనకారులు చొచ్చుకెళ్లారు. వారిపై పోలీసులు భాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.(REUTERS)
ప్లనాల్టో భవనంలో జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు లూలా. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు ఇక్కడ విధ్వంసం సృష్టించారు.
(2 / 8)
ప్లనాల్టో భవనంలో జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు లూలా. మాజీ అధ్యక్షుడు బొల్సొనారో మద్దతుదారులు ఇక్కడ విధ్వంసం సృష్టించారు.(AP)
అధ్యక్షుడి భవనం వద్ద బ్రెజిల్​ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న ఓ బొల్సొనారో మద్దతుదారుడు.
(3 / 8)
అధ్యక్షుడి భవనం వద్ద బ్రెజిల్​ జెండా పట్టుకుని నిరసన తెలుపుతున్న ఓ బొల్సొనారో మద్దతుదారుడు.(REUTERS)
పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ధ్వంసం చేసి.. కాంగ్రెస్​లోకి చొచ్చుకెళ్లారు ఆందోళనకారులు. కాంగ్రెస్​లోని అద్దాలు పగలగొట్టారు. కుర్చీలను ధ్వంసం చేశారు.
(4 / 8)
పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ధ్వంసం చేసి.. కాంగ్రెస్​లోకి చొచ్చుకెళ్లారు ఆందోళనకారులు. కాంగ్రెస్​లోని అద్దాలు పగలగొట్టారు. కుర్చీలను ధ్వంసం చేశారు.(AFP)
నేషనల్​ కాంగ్రెస్​ ప్రాంగణంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్​ గ్యాస్​ను ప్రయోగించారు పోలీసులు. హెలికాఫ్టర్​ ద్వారా టియర్​ గ్యాస్​ను వదిలారు. మరోవైపు నేల మీద నుంచి కాల్పులు జరిపారు.
(5 / 8)
నేషనల్​ కాంగ్రెస్​ ప్రాంగణంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్​ గ్యాస్​ను ప్రయోగించారు పోలీసులు. హెలికాఫ్టర్​ ద్వారా టియర్​ గ్యాస్​ను వదిలారు. మరోవైపు నేల మీద నుంచి కాల్పులు జరిపారు.(REUTERS)
నేషనల్​ కాంగ్రెస్​ వద్ద గుమిగూడిన బొల్సొనారో మద్దతుదారులు.. బ్రెజిల్​ జెండాలను ఎగురవేశారు. 
(6 / 8)
నేషనల్​ కాంగ్రెస్​ వద్ద గుమిగూడిన బొల్సొనారో మద్దతుదారులు.. బ్రెజిల్​ జెండాలను ఎగురవేశారు. (REUTERS)
బ్రెసీలియాలోని నేషనల్​ కాంగ్రెస్​ వద్ద నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.
(7 / 8)
బ్రెసీలియాలోని నేషనల్​ కాంగ్రెస్​ వద్ద నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.(REUTERS)
నేషనల్​ కాంగ్రెస్​లోకి చొచ్చుకెళ్లిన అనంతరం.. స్పీకర్​ డయాస్​ మీద కూర్చున్న నిరసనకారులు.
(8 / 8)
నేషనల్​ కాంగ్రెస్​లోకి చొచ్చుకెళ్లిన అనంతరం.. స్పీకర్​ డయాస్​ మీద కూర్చున్న నిరసనకారులు.

    ఆర్టికల్ షేర్ చేయండి