తెలుగు న్యూస్  /  ఫోటో  /  Home Remedies For Dengue : ఆయుర్వేదంతో డెంగ్యూ జ్వరానికి ఇలా చెక్​ పెట్టేయండి..

Home Remedies for Dengue : ఆయుర్వేదంతో డెంగ్యూ జ్వరానికి ఇలా చెక్​ పెట్టేయండి..

19 July 2022, 13:37 IST

Home Remedies for Dengue : వర్షాకాలం ప్రారంభం కాగానే డెంగ్యూ, మలేరియా విజృంభిస్తాయి. జర్వం ఎక్కువకాలం ఉంటే వైద్యులను సంప్రదించక తప్పదు. అయితే.. ఇంట్లోనే కొన్ని నివారణ చిట్కాలు కూడా ఉన్నాయి. మీరు డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లయితే.. ఈ ఆయుర్వేద ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో డెంగ్యూ వ్యాప్తి మొదలైంది. తాజాగా తెలంగాణలో కూడా టైఫాయిడ్, డెంగ్యూ ప్రబలుతుందని డీహెచ్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో జ్వరం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను తప్పకుండా సంప్రదించాలి.
(1 / 8)

లక్షణాలు - డెంగ్యూ జ్వరం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల రోగి త్వరగా బలహీనపడతాడు. శారీరక అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, దద్దుర్లు, కీళ్ల నొప్పులు, వికారం, కళ్ల వెనుక నొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి.
(2 / 8)

డెంగ్యూ వ్యాధిని నయం చేయడానికి డాక్టర్ సూచించిన ఔషధాలు కచ్చితంగా ఉపయోగించాలి. వాటితో పాటు కొన్ని ఇంటి నివారణులు కూడా మనల్ని డెంగ్యూతో పోరాడేలా చేస్తాయి.
(3 / 8)

మెంతులు - డెంగ్యూ జ్వరం కారణంగా శరీరం, అవయవాలు నొప్పిగా ఉంటే మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. దీంతో జ్వరం వల్ల వచ్చే నొప్పి తగ్గుతుంది.
(4 / 8)

నిమ్మరసం - డెంగ్యూ సోకితే నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచుతుంది.
(5 / 8)

వేప - వేపలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. వేప రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు.. వేప ఆకులు నానబెట్టిన నీటిని తాగడం కూడా మంచిది.
(6 / 8)

బొప్పాయి ఆకు - బొప్పాయి ఆకు డెంగ్యూ నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీన్ని మరిగించి ఆ నీటిని తాగడం లేదా బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది ప్లేట్‌లెట్స్‌ని పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి