తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jasprit Bumrah: రికార్డు సృష్టించిన జస్‍ప్రీత్ బుమ్రా: వివరాలివే

Jasprit Bumrah: రికార్డు సృష్టించిన జస్‍ప్రీత్ బుమ్రా: వివరాలివే

03 February 2024, 19:47 IST

Jasprit Bumrah - India vs England: టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన నేడు (ఫిబ్రవరి 3) ఆరు వికెట్లతో సత్తాచాటాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు నెలకొల్పాడు. 

  • Jasprit Bumrah - India vs England: టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా మరోసారి అదరగొట్టాడు. స్వదేశంలో ఇంగ్లండ్‍తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజైన నేడు (ఫిబ్రవరి 3) ఆరు వికెట్లతో సత్తాచాటాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు నెలకొల్పాడు. 
ఇంగ్లండ్‍తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా విజృంభించాడు. మ్యాచ్ రెండో రోజైన నేడు ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ లైనప్‍ను కుప్పకూల్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు 253 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‍కు భారీ ఆధిక్యం దక్కింది. కాగా, ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు సృష్టించాడు. 
(1 / 5)
ఇంగ్లండ్‍తో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా విజృంభించాడు. మ్యాచ్ రెండో రోజైన నేడు ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ లైనప్‍ను కుప్పకూల్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు 253 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్‍కు భారీ ఆధిక్యం దక్కింది. కాగా, ఈ క్రమంలో బుమ్రా ఓ రికార్డు సృష్టించాడు. (PTI)
అత్యంత వేగంగా 150 టెస్టు వికెట్లు తీసిన భారత పేసర్‌గా జస్‍ప్రీత్ బుమ్రా రికార్డు (బంతుల పరంగా) నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‍లో 6781 బంతుల్లోనే 150 వికెట్లను దక్కించుకున్నాడు. బెన్ స్టోక్స్‌ను ఔట్ చేశాక ఈ రికార్డుకు బుమ్రా చేరుకున్నాడు. 
(2 / 5)
అత్యంత వేగంగా 150 టెస్టు వికెట్లు తీసిన భారత పేసర్‌గా జస్‍ప్రీత్ బుమ్రా రికార్డు (బంతుల పరంగా) నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‍లో 6781 బంతుల్లోనే 150 వికెట్లను దక్కించుకున్నాడు. బెన్ స్టోక్స్‌ను ఔట్ చేశాక ఈ రికార్డుకు బుమ్రా చేరుకున్నాడు. (PTI)
ఉమేశ్ యాదవ్ (7661 బంతులు)ను దాటేసి వేగంగా 150 టెస్టు వికెట్లు దక్కించుకున్న భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానానికి వచ్చాడు. మహమ్మద్ షమీ (7755), కపిల్ దేవ్ (8378) మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. 
(3 / 5)
ఉమేశ్ యాదవ్ (7661 బంతులు)ను దాటేసి వేగంగా 150 టెస్టు వికెట్లు దక్కించుకున్న భారత ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానానికి వచ్చాడు. మహమ్మద్ షమీ (7755), కపిల్ దేవ్ (8378) మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. (AP)
అలాగే, టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు జస్‍ప్రీత్ బుమ్రా. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారత పేసర్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ లిస్టులో చెరో 11 సార్లతో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నారు. 
(4 / 5)
అలాగే, టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు జస్‍ప్రీత్ బుమ్రా. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన భారత పేసర్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. ఈ లిస్టులో చెరో 11 సార్లతో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నారు. (AP)
ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 రన్స్ చేసింది. ఇంగ్లండ్ రెండో రోజే తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 28 రన్స్ చేసింది. దీంతో 171 పరుగుల ఆధిక్యానికి చేరింది. మూడో రోజు ఆటను కొనసాగించనుంది. 
(5 / 5)
ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 396 రన్స్ చేసింది. ఇంగ్లండ్ రెండో రోజే తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండో రోజు ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 28 రన్స్ చేసింది. దీంతో 171 పరుగుల ఆధిక్యానికి చేరింది. మూడో రోజు ఆటను కొనసాగించనుంది. (REUTERS)

    ఆర్టికల్ షేర్ చేయండి