తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ban Vs Ned: బంగ్లాదేశ్‍కు పరాభవం.. నెదర్లాండ్స్ తొలిసారి ఇలా..

BAN vs NED: బంగ్లాదేశ్‍కు పరాభవం.. నెదర్లాండ్స్ తొలిసారి ఇలా..

28 October 2023, 22:02 IST

BAN vs NED - ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో నెదర్లాండ్స్ మరోసారి సత్తాచాటింది. నేడు (అక్టోబర్ 28) జరిగిన మ్యాచ్‍లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఐదో ఓటమితో సెమీస్ ఆశలను బంగ్లా గల్లంతు చేసుకుంది.

  • BAN vs NED - ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో నెదర్లాండ్స్ మరోసారి సత్తాచాటింది. నేడు (అక్టోబర్ 28) జరిగిన మ్యాచ్‍లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‍పై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఐదో ఓటమితో సెమీస్ ఆశలను బంగ్లా గల్లంతు చేసుకుంది.
వన్డే ప్రపంచకప్‍లో భాగంగా నేడు (అక్టోబర్ 28) కోల్‍కతాలోని ఈడెన్ గార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‍లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‍పై గెలిచింది. అన్ని విభాగాల్లో సత్తాచాటిన డచ్ టీమ్.. బంగ్లాను చిత్తు చేసింది.
(1 / 6)
వన్డే ప్రపంచకప్‍లో భాగంగా నేడు (అక్టోబర్ 28) కోల్‍కతాలోని ఈడెన్ గార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‍లో నెదర్లాండ్స్ 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‍పై గెలిచింది. అన్ని విభాగాల్లో సత్తాచాటిన డచ్ టీమ్.. బంగ్లాను చిత్తు చేసింది. (PTI)
ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68 పరుగులు) అర్ధ శకతంతో చెలరేగగా.. వెస్లే బారెసి (41) రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, మెహదీ హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. 
(2 / 6)
ఈ మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68 పరుగులు) అర్ధ శకతంతో చెలరేగగా.. వెస్లే బారెసి (41) రాణించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, మెహదీ హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. (Hindustan Times)
లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ కుప్పకూలింది. 42.2 ఓవర్లలో 142 పరుగులకే బంగ్లా ఆలౌటై, ఓటమి పాలైంది. మెహదీ హసన్ మిరాజ్ (35) మినహా మిగిలిన బంగ్లా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. చివర్లో ముస్తాఫిజుర్ (20) కాసేపు నిలువటంతో ఆ మాత్రం స్కోరు వచ్చింది. 
(3 / 6)
లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ కుప్పకూలింది. 42.2 ఓవర్లలో 142 పరుగులకే బంగ్లా ఆలౌటై, ఓటమి పాలైంది. మెహదీ హసన్ మిరాజ్ (35) మినహా మిగిలిన బంగ్లా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. చివర్లో ముస్తాఫిజుర్ (20) కాసేపు నిలువటంతో ఆ మాత్రం స్కోరు వచ్చింది. (AFP)
నెదర్లాండ్ బౌలర్ పౌల్ వాన్ మీకెరెన్ నాలుగు వికెట్లతో బంగ్లాను కుప్పకూల్చాడు. బాస్ డే లీడ్ రెండు, ఆర్యన్ దత్, వాన్ బీక్, అకర్మెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 
(4 / 6)
నెదర్లాండ్ బౌలర్ పౌల్ వాన్ మీకెరెన్ నాలుగు వికెట్లతో బంగ్లాను కుప్పకూల్చాడు. బాస్ డే లీడ్ రెండు, ఆర్యన్ దత్, వాన్ బీక్, అకర్మెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. (PTI)
ఈ ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍లు ఆడి,  ఐదింట ఓడింది. గ్రూప్ స్టేజీలో ఇంకా ఆ టీమ్‍ మూడు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‍లు గెలిచినా బంగ్లా సెమీస్ చేరలేదు. 
(5 / 6)
ఈ ప్రపంచకప్‍లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‍లు ఆడి,  ఐదింట ఓడింది. గ్రూప్ స్టేజీలో ఇంకా ఆ టీమ్‍ మూడు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‍లు గెలిచినా బంగ్లా సెమీస్ చేరలేదు. (ANI)
ఇక, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‍లో రెండు మ్యాచ్‍ల్లో విజయాలు సాధించడం నెదర్లాండ్స్ టీమ్‍కు ఇదే తొలిసారి. ఈ వరల్డ్ కప్‍లో దక్షిణాఫ్రికాపై సంచలన గెలుపు సాధించిన నెదర్లాండ్స్.. నేడు బంగ్లాపై విజయం సాధించింది. గ్రూప్ స్టేజీలో నెదర్లాండ్స్ కూడా ఇంకా మూడు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. 
(6 / 6)
ఇక, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‍లో రెండు మ్యాచ్‍ల్లో విజయాలు సాధించడం నెదర్లాండ్స్ టీమ్‍కు ఇదే తొలిసారి. ఈ వరల్డ్ కప్‍లో దక్షిణాఫ్రికాపై సంచలన గెలుపు సాధించిన నెదర్లాండ్స్.. నేడు బంగ్లాపై విజయం సాధించింది. గ్రూప్ స్టేజీలో నెదర్లాండ్స్ కూడా ఇంకా మూడు మ్యాచ్‍లు ఆడాల్సి ఉంది. (Hindustan Times)

    ఆర్టికల్ షేర్ చేయండి