తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Benefits Of Taking A Soak In Hot Water Spring

Soak in Hot Water । వేడి నీటి కొలనుల్లో స్నానం చేయండి.. ఈ ప్రయోజనాలు ఉంటాయి!

18 July 2022, 9:36 IST

వేడి నీటి స్నానాలు వేలాది సంవత్సరాలుగా వివిధ సాధారణ వ్యాధుల చికిత్సలో భాగంగా ఉంటున్నాయి. కొద్దిసేపు వేడినీటిలో గడపటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

  • వేడి నీటి స్నానాలు వేలాది సంవత్సరాలుగా వివిధ సాధారణ వ్యాధుల చికిత్సలో భాగంగా ఉంటున్నాయి. కొద్దిసేపు వేడినీటిలో గడపటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.
మీరు ఎప్పుడైనా కొండ ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, మీరు ఆ ప్రదేశంలో లేదా చుట్టుపక్కల ఏవైనా వేడి నీటి బుగ్గలు ఉన్నాయోమో తప్పనిసరిగా కనుక్కోండి. కొన్ని చోట్ల ఆవిరితో కూడిన వేడి నీటి కొలనులు, వనరులు ఉంటాయి. వీటినే వేడి నీటి బుగ్గలు అంటారు. ఈ నీటిలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ నీటిలో సేద తీరటం వలన అది శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదపడే ప్రయోజనాలను కలిగి ఉంటుంది. భారతదేశంలో మణికరణ్, తట్టపాణి, కసోల్, వశిష్ట, ఖీర్గంగా వంటి ప్రదేశాలలో ఇలాంటి వేడి నీటి బుగ్గలు ఉన్నాయి.
(1 / 7)
మీరు ఎప్పుడైనా కొండ ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, మీరు ఆ ప్రదేశంలో లేదా చుట్టుపక్కల ఏవైనా వేడి నీటి బుగ్గలు ఉన్నాయోమో తప్పనిసరిగా కనుక్కోండి. కొన్ని చోట్ల ఆవిరితో కూడిన వేడి నీటి కొలనులు, వనరులు ఉంటాయి. వీటినే వేడి నీటి బుగ్గలు అంటారు. ఈ నీటిలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ నీటిలో సేద తీరటం వలన అది శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదపడే ప్రయోజనాలను కలిగి ఉంటుంది. భారతదేశంలో మణికరణ్, తట్టపాణి, కసోల్, వశిష్ట, ఖీర్గంగా వంటి ప్రదేశాలలో ఇలాంటి వేడి నీటి బుగ్గలు ఉన్నాయి.(Unsplash)
వేడి నీటి బుగ్గల్లో కాల్షియం, సోడియం బైకార్బోనేట్‌తో సహా అనేక విభిన్న ఖనిజాలు ఉంటాయి. ఈ నీటిని శరీరానికి పట్టిస్తే అది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతాయి.
(2 / 7)
వేడి నీటి బుగ్గల్లో కాల్షియం, సోడియం బైకార్బోనేట్‌తో సహా అనేక విభిన్న ఖనిజాలు ఉంటాయి. ఈ నీటిని శరీరానికి పట్టిస్తే అది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతాయి.(Unsplash)
మినరల్స్ కలిగిన వేడి నీటిలో సేద తీరటం వలన అది ఉద్రిక్త కండరాలను సడలిస్తుంది. తద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఖనిజాలు శరీరంలోకి చొచ్చుకుపోతాయి, హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తాయి.
(3 / 7)
మినరల్స్ కలిగిన వేడి నీటిలో సేద తీరటం వలన అది ఉద్రిక్త కండరాలను సడలిస్తుంది. తద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఖనిజాలు శరీరంలోకి చొచ్చుకుపోతాయి, హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తాయి.(Unsplash)
వేడి నీటిలో ఉండటం ఎంతో హాయిని కలిగిస్తుంది. ఇది ప్రశాంతమైన రాత్రి నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
(4 / 7)
వేడి నీటిలో ఉండటం ఎంతో హాయిని కలిగిస్తుంది. ఇది ప్రశాంతమైన రాత్రి నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.(Unsplash)
నీటిలోని వెచ్చదనం, ఖనిజాలు మన శరీరంలోని నొప్పి గ్రాహకాలను నిరోధిస్తాయి. తద్వారా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కండరాల నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(5 / 7)
నీటిలోని వెచ్చదనం, ఖనిజాలు మన శరీరంలోని నొప్పి గ్రాహకాలను నిరోధిస్తాయి. తద్వారా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కండరాల నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.(Unsplash)
వేడి నీటి బుగ్గలలోని సల్ఫర్ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ నీటిలో కాసేపు ఉంటే తామర, సోరియాసిస్ చికిత్సతో పాటు శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, మృదువైన చర్మాన్ని పొందవచ్చు. అయితే అందరికీ వేడి నీటి బుగ్గలో స్నానం పడకపోవచ్చు. మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
(6 / 7)
వేడి నీటి బుగ్గలలోని సల్ఫర్ ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ నీటిలో కాసేపు ఉంటే తామర, సోరియాసిస్ చికిత్సతో పాటు శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. మీకు పొడి చర్మం ఉన్నట్లయితే, మృదువైన చర్మాన్ని పొందవచ్చు. అయితే అందరికీ వేడి నీటి బుగ్గలో స్నానం పడకపోవచ్చు. మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి