తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pocso Act: పిల్లలపై లైంగిక వేధింపులు .. పోక్సో చట్టం ఏం చెబుతోంది?

POCSO Act: పిల్లలపై లైంగిక వేధింపులు .. పోక్సో చట్టం ఏం చెబుతోంది?

04 August 2022, 17:51 IST

google News
    • POCSO Act: చిన్నారులను చిదిమేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ.. శ్రేయోభిలాషులు,బంధువులు, ట్యూషన్ మాస్టార్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై ఈ దుర్మార్గులు వికృత క్రీడకు తెరలేపుతున్నారు. ఇలాంటి అకృత్యాలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పోక్సో చట్టాన్ని తీసుకొచ్చింది.
pocso act
pocso act

pocso act

POCSO Act: “తల్లిదండ్రులు పని కోసం బయట వెళ్ళారు. ఇంటి పక్కన ఉన్న పెద్దాయిన వారి పాపపై కన్నేశాడు. చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆడకుంటున్నా పాపపై ఇలాంటి అఘాయిత్యమే, బడిలో చదువుతున్న పాపపై మాస్టర్ కన్ను, పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్తున్న చిన్నారిపై ఓ కుర్రాడు అకృత్యం”

ఇలా ఒక్కటేమిటి..

గర్భంలో ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డు ప్రాణాన్నికూడా చిదిమేస్తున్నారు కామాందులు. పిల్లల జీవితాలను ఛిద్రం చేసే నీచులు ఎక్కడో ఉండరు. మనతో మంచిగా నటిస్తూ.. శ్రేయోభిలాషులు,బంధువులు, ట్యూషన్ మాస్టార్, సన్నిహితుల రూపంలో చుట్టూనే ఉంటూ పిల్లలపై వికృత క్రీడకు తెరలేపుతున్నారు. ఇలాంటి పరిణామాలు సమాజాన్ని తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

POCSO చట్టం

ఇలాంటి ఘటనలపై తీవ్ర వేదన వ్యక్తం చేస్తూ, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్రమైన చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఆడపిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం POCSO చట్టాన్ని రూపొందించింది. వికృత చేష్టలతో పిల్లల జీవించే హక్కును హరించి వారికి ముప్పు వాటిల్లేలా చేస్తే ఈ చట్టం ద్వారా కఠినంగా శిక్షిస్తుంది. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందుతులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

2012లో వచ్చిన ఫోక్సో చట్టం (The Protection of Children from Sexual Offences Act, 2012) 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించారు . వారిపై అత్యాచారం పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు.

చట్టంలోని ప్రధానాంశాలు

మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం ప్రభుత్వం కాలపరిమితిని సూచించింది. తప్పనిసరిగా రెండు నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది.

అత్యాచార కేసులలో అప్పీళ్ల పరిష్కారానికి ఆరు నెలల కాలపరిమితిని కూడా నిర్దేశించింది. బాలికపై లైంగికంగా హింసిస్తే POCSO చట్టం కింద నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండాహైకోర్టు సూచనలతో కొత్త ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యేకంగా పోక్సో ఈ-బాక్స్‌ కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఆసుపత్రులు, పోలీస్‌ స్టేషన్‌లు, కోర్టుల్లో ఫిర్యాదు చేసేలా పిల్లలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించింది.

POCSO Act: చట్టానికి అవరోధాలు

చాలామంది చిన్న పిల్లలు లైంగికవేధింపులు ఎదుర్కొంటునప్పటికీ వారిని గుర్తించలేకపోతున్నారు. దీంతో కీచకులపై ఫిర్యాదులు చేయలేకపోతున్నారు. ఇదే దుర్మార్గులకు అనుకూలంగా మారింది. ముద్దు, లైంగిక చర్యకు ప్రేరణ, రహస్య భాగాలను తాకడం, నగ్నచిత్రాలను చూపడం వంటివి వేధింపుల్లో భాగమేననే విషయం చిన్నారులకు తెలియడం లేదు. చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే వారు కుటుంబ సభ్యులు లేదా దగ్గరి బంధువులై ఉండటం వల్ల ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.

అత్యాచారం కేసుల్లో నిందితుడు బాధితురాలి కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే శిక్షల విషయం సమస్య మరింత పెద్దదవుతోంది. కుటుంబ సభ్యుడు లేదా బంధువు ద్వారా లైంగిక వేధింపులకు గురైన చిన్నారి బాధితురాళ్లు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశాలు వాస్తవికంగా చాలా తక్కువగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం