Immunity for Children | పిల్లల ఆరోగ్యానికి ఈ ఆహారాలు ఉత్ప్రేరకాలు
28 February 2022, 18:02 IST
- పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఈ కారణంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు వారికి సమర్థవంతమైన, అన్ని పోషకాలు ఉండే ఆహారాన్ని అందించాలి. మరి పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లలకు బెస్ట్ డైట్
Immunity for Children.. కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పి కాటేసిందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటికే ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పెద్దవారి మాదిరిగా చిన్నపిల్లలకు వైరస్, సూక్ష్మజీవులపై పెద్దగా అవగాహన ఉండదు. ఈ కారణంగా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు వారికి సమర్థవంతమైన, అన్ని పోషకాలు ఉండే ఆహారాన్ని అందించాలి. మరి పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు ఉత్ప్రేరకాలుగా పనిచేసే ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం.
గుడ్లు..
సంపూర్ణ పోషకాలుండే ఆహారాల జాబితాలో గుడ్డు ముందు వరుసలో ఉంటుంది. ఇందులో విటమిన్-డీ, జింక్. సెలినీయం, విటమిన్-ఈ లాంటి పోషకాలు ఉంటాయి. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. అంతేకాకుండా గుడ్లు ప్రోటీన్లకు మంచి వనరు. శిశువులకు తగిన శక్తిని అందించి వారికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
సాల్మన్ చేప..
ఓమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహారం సాల్మన్ చేప. నొప్పిని నివారించి పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించేలా ఈ చేప దోహద పడుతుంది. అంతేకాకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. చిన్నతనంలోనే చేపలను ఆహారంలో భాగంగా వారికి తినిపిస్తే వారి ఎదుగుదల కూడా బాగుంటుంది.
బాదం..
విటమిన్-ఈ, మాంగనీస్ సమృద్ధిగా ఉండే ఆహారం బాదం గింజలు. రోజూ ఉదయాన్నే వీటని కొన్నింటిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీటిని పిల్లలకు స్నాక్స్ రూపంలో అందిస్తే మంచిది. బరువు తగ్గడంలోనూ ఈ బాదం గింజలు ఎంతో తోడ్పడుతాయి.
పెరుగు..
పిల్లలకు సులభంగా జీర్ణమై.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం పెరుగు. ఇది వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సాయపడుతుంది. అంతేకాకుండా వేడిని కూడా తగ్గిస్తుంది. చక్కెర లేకుండా పెరుగును పిల్లలకు తినిపంచేలా జాగ్రత్త పడండి.
బ్రొకోలి..
పిల్లలకు ఇచ్చే ఆహారాల్లో బ్రొకోలి అత్యంత ఆరోగ్యకరమైంది. ఆకుకూర కావడం వల్ల పిల్లలకు సమృద్ధిగా పోషకాలు, విటమిన్లు అందుతాయి. అంతేకాకుండా పోషకాలకు పవర్ హౌస్ గా పనిచేస్తుంది. ఫలితంగా చిన్నపిల్లల్లో ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
ఓట్ మీల్..
ఓట్స్ లో పైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా ఇతర విలువైన పోషకలవణాలు కూడా పుష్కలంగా దొరుకుతాయి. చిన్న పిల్లలకు త్వరగా జీర్ణం చేయడంలోనే కాకుండా రోగకారక క్రిములను నిరోధిచడంలో ఓట్ మీల్ సహాయపడుతుంది. ఫలితంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది.
టాపిక్