తెలుగు న్యూస్  /  national  /  Sanjay Raut Arrested Illegally: సంజయ్ రౌత్ అరెస్ట్ అక్రమం; ఈడీపై కోర్టు మండిపాటు

Sanjay Raut Arrested Illegally: సంజయ్ రౌత్ అరెస్ట్ అక్రమం; ఈడీపై కోర్టు మండిపాటు

HT Telugu Desk HT Telugu

09 November 2022, 23:44 IST

google News
  • Sanjay Raut gets Bail: శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబైలోని స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కోర్టు ఈడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత వేధింపులకు ఉదాహరణగా ఈ అరెస్ట్ ఉందని మండిపడింది. 

జైలు నుంచి విడుదలైన అనంతరం అభిమానులకు అభివాదం చేస్తున్న సంజయ్ రౌత్
జైలు నుంచి విడుదలైన అనంతరం అభిమానులకు అభివాదం చేస్తున్న సంజయ్ రౌత్ (PTI)

జైలు నుంచి విడుదలైన అనంతరం అభిమానులకు అభివాదం చేస్తున్న సంజయ్ రౌత్

Sanjay Raut gets Bail: శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ కు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత, ఈ తీర్పును సవాలు చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ బొంబాయి హైకోర్టును ఆశ్రయించగా, అక్కడా ఈడీకి చుక్కెదురైంది.

Sanjay Raut Arrested Illegally: కోర్టు మండిపాటు

సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత కక్ష, వ్యక్తిగత వేధింపులో భాగంగా ఈ అరెస్ట్ చేసినట్లు కనిపిస్తోందని మండిపడింది. సివిల్ కేసును కూడా ఆర్థిక అవకతవకలుగా పేర్కొంటూ అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించింది. సంజయ్ రౌత్ తో పాటు అరెస్టైన ప్రవీణ్ రౌత్ అరెస్ట్ కు సరైన కారణమే లేదని పేర్కొంది. ప్రవీణ్ రౌత్ కు కూడా బెయిల్ మంజూరు చేసింది. సంజయ్ రౌత్ అరెస్ట్ అక్రమమని, కావాలని ఎంపిక చేసుకుని, వేధించే ఆలోచనతో చేసిన పనిగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఒక సివిల్ వివాదాన్ని మనీ లాండరింగ్ కేసుగా మార్చడం విస్మయపరుస్తోందని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి దేశ్ పాండే వ్యాఖ్యానించారు.

Sanjay Raut gets Bail: హైకోర్టు సమర్ధన

స్పెషల్ కోర్టు తీర్పును వెంటనే ఈడీ హైకోర్టులో సవాలు చేసింది. అయితే, ఈ ప్రాతిపదికన కింది కోర్టు తీర్పును సవాలు చేస్తున్నారో చెప్పాలని, రెండు వర్గాల వాదన వినకుండా, బెయిల్ పై స్టే ఇవ్వలేనని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో, బుధవారం సాయంత్రం ఆర్థర్ రోడ్ జైలు నుంచి సంజయ్ రౌత్ విడుదలయ్యారు. ఆయనకు శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. తాను తప్పేం చేయలేదని, న్యాయ వ్యవస్థ తనకు న్యాయం చేసిందని రౌత్ వ్యాఖ్యానించారు.

తదుపరి వ్యాసం