తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పశువుల మేత తయారీ, నిల్వ యూనిట్లకు రూ. 50 లక్షల సబ్సిడీ ఇచ్చే పథకం

పశువుల మేత తయారీ, నిల్వ యూనిట్లకు రూ. 50 లక్షల సబ్సిడీ ఇచ్చే పథకం

24 January 2022, 21:02 IST

google News
    • పశువుల మేత తయారీ, నిల్వ ప్రాజెక్టులకు కేంద్రం నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పరిధిలో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ యాక్టివిటీస్‌ ఇన్‌ ఫీడ్‌ అండ్‌ ఫాడర్‌ స్కీమ్‌ ద్వారా రూ. 50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తోంది. 
ప్రతీకాత్మక చిత్రం: పశువుల మేత తయారీకి సబ్సిడీ పథకం
ప్రతీకాత్మక చిత్రం: పశువుల మేత తయారీకి సబ్సిడీ పథకం (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం: పశువుల మేత తయారీకి సబ్సిడీ పథకం

కేంద్ర పశుసంవర్థక శాఖ(డీఏహెచ్‌డీ) పరిధిలో రాష్ట్ర పశుసంవర్థక శాఖకు చెందిన స్టేట్‌ ఇంప్లిమెంట్‌ ఏజెన్సీ నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పరిధిలో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ యాక్టివిటీస్‌ ఇన్‌ ఫీడ్‌ అండ్‌ ఫాడర్‌ స్కీమ్‌ అమలు చేస్తుంది. స్టేట్‌ లైవ్‌స్టాక్‌ ఏజెన్సీలు, స్టేట్‌ లైవ్‌స్టాక్‌ బోర్డులు కూడా ఈ పథకం అమలయ్యేలా చూస్తాయి.

ప్రైవేట్‌ వ్యవస్థాపకులు, డెయిరీ సహకార సంఘాలు, సెక్షన్‌ 8 కంపెనీలు, స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, రైతు సహకార సంఘాలు ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు.

ఎలాంటి ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి?

ఎండుగడ్డి, పచ్చి గడ్డి నిల్వ, మొత్తం మిశ్రమ రేషన్‌(టీఎంఆర్‌), ఫాడర్‌ బ్లాక్, మేత నిల్వ వంటి విలువ జోడింపు అంశాలతో కూడిన ప్రాజెక్టులకు క్యాపిటల్‌ కాస్ట్‌లో 50 శాతం సబ్సిడీ అందుతుంది.

గ్రామ స్థాయిలో ఎండుగడ్డి / పచ్చి గడ్డి నిల్వలకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫాడర్‌ బ్లాక్‌ మెషీన్స్, బెయిలర్, టీఎంఆర్‌ మిషన్స్, ఫోరేజ్‌ హార్వెస్టర్, రీపర్‌ వంటి యంత్రాలను కొనుగోలు చేయడానికి సబ్సిడీ వర్తిస్తుంది. అలాగే హెవీ డ్యూటీ పవర్‌ ఆపరేటెడ్‌ ఛాఫ్‌ కట్టర్స్, పీహెచ్‌టీ పరికరాలకు సబ్సిడీ వర్తిస్తుంది.

మిగిలిన సగ భాగం మూలధనాన్ని బ్యాంకుల ద్వారా గానీ, సొంతంగా గానీ సమకూర్చుకోవాలి. సబ్సిడీ రెండు విడతలుగా అందుతుంది. తొలి విడత ప్రాజెక్టు ప్రారంభంలో, రెండో విడత ప్రాజెక్టు పూర్తయ్యాక బ్యాంకు ద్వారా అందుతుంది.

అయితే సబ్సిడీ.. వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం గానీ, వ్యక్తిగత వాహనాల కొనుగోలు కోసం గానీ, భూమి కొనుగోలు, లీజు కోసం వెచ్చింపు, కార్యాలయ వసతి వంటి వాటి కోసం వర్తించదు.

ఆయా యూనిట్లు పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధి కింద కూడా ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది.

 

తదుపరి వ్యాసం