తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రూ. 30 లక్షల సబ్సిడీ స్కీమ్‌.. ప్రమోషన్‌ ఆఫ్‌ పిగ్గరీ ఎంట్రప్రెన్యూర్‌‌షిప్

రూ. 30 లక్షల సబ్సిడీ స్కీమ్‌.. ప్రమోషన్‌ ఆఫ్‌ పిగ్గరీ ఎంట్రప్రెన్యూర్‌‌షిప్

24 January 2022, 17:27 IST

google News
    • నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రమోషన్‌ ఆఫ్‌ పిగ్గరీ ఎంట్రప్రెన్యూర్‌’ అన్న పథకం ద్వారా పందుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సబ్సిడీ సమకూరుస్తోంది.
పందుల పెంపకం
పందుల పెంపకం (Unsplash)

పందుల పెంపకం

నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా సబ్సిడీ అందిస్తోంది.  ‘ప్రమోషన్‌ ఆఫ్‌ పిగ్గరీ ఎంట్రప్రెన్యూర్‌’ పథకం ఇందులో ఒకటి.  

దేశంలో ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం, పందుల ఉత్పాదకత పెంపు, జన్యు నవీకరణ ద్వారా పంది మాంసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో కేంద్రం ఈ స్కీమ్‌ను రూపొందించింది.

స్కీమ్‌కు ఎవరు అర్హులు? ఏ యూనిట్‌కు ఇస్తారు?

వ్యక్తులు, స్వయం సహాయక బృందాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, రైతు సహకార సంఘాలు, జాయింట్‌ లయబిలిటీ గ్రూప్స్, సెక్షన్‌ 8 కంపెనీలు ఈ స్కీమ్‌ను ఎంచుకునేందుకు అర్హత కలిగి ఉన్నాయి.

కనిష్టంగా 100 ఆడ పందులు, 25 మగ పందులతో బ్రీడింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు క్యాపిటల్‌ కాస్ట్‌పైన కేంద్ర ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. 

ఈ సబ్సిడీ గరిష్టంగా రూ. 30 లక్షలు ఉంటుంది. హౌజింగ్, బ్రీడింగ్, రవాణా, బీమా వ్యయం, యంత్రాల వ్యయం వంటి కాంపొనెంట్లకు సబ్సిడీ వర్తిస్తుంది.

మిగిలిన 50 శాతం మొత్తాన్ని బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ లేదా సొంతంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. 

భూమి కొనుగోలు, అద్దె, లీజుకు సబ్సిడీ వర్తించదు. అలాగే వ్యక్తిగత వాహనం ఖర్చు కోసం కూడా సబ్సిడీ వర్తించదు.

సబ్సిడీ రెండు సమాన వాయిదాల్లో విడుదల అవుతుంది. తొలి వాయిదా బ్యాంకు ద్వారా యూనిట్‌ యజమాని ఖాతాలో జమవుతుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక మిగిలిన మొత్తం జమవుతుంది.

ఎవరు అమలు చేస్తారు? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

రాష్ట్ర పశు సంవర్థక శాఖ పరిధిలోని స్టేట్‌ ఇంప్లిమెంట్‌ ఏజెన్సీ దీనిని ఈ స్కీమ్‌ను అమలు చేస్తుంది. 

ఆ శాఖ ఇచ్చే నోటిఫికేషన్‌ ఆధారంగా గానీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్‌ హజ్బెండరీ అండ్‌ డైరీయింగ్‌ (డీఏడీహెచ్‌) వెబ్‌సైట్‌లో సర్క్యులర్, మార్గదర్శకాల ఆధారంగా గానీ ఈ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం