తెలుగు న్యూస్  /  national  /  Two Dalit Sisters Rape In Up: దారుణంగా రేప్ చేసి చంపేశారు

two dalit sisters rape in up: దారుణంగా రేప్ చేసి చంపేశారు

HT Telugu Desk HT Telugu

15 September 2022, 17:38 IST

google News
  • two dalit sisters rape in up: ఇద్దరు దళిత, మైనర్ అక్కా చెల్లెళ్లను దారుణంగా హత్యాచారం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. వారి ఇంటికి సమీపంలోనే ఒక చెరకు తోటలో వారి మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.

బాధిత బాలికల మృతదేహాలు; పోలీసుల విచారణ
బాధిత బాలికల మృతదేహాలు; పోలీసుల విచారణ

బాధిత బాలికల మృతదేహాలు; పోలీసుల విచారణ

Dalit sisters raped and murdered in UP: హత్యాచారం..

హత్యాచారానికి గురైన బాలికల మృతదేహాలకు అటాప్సీ నిర్వహించారు. ఆ బాలికలు అత్యాచారానికి గురైనట్లు అటాప్సీలో తేలింది. వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. జునాయిద్, సొహాయిల్, హఫీజుర్ రెహ్మాన్, కరీముద్దీన్, ఆరిఫ్, చోటు లను అరెస్ట్ చేశామన్నారు. వీరిలో జునాయిద్, సొహాయిల్ లకు ఆ ఇద్దరు బాలికలతో స్నేహం ఉందని వివరించారు. వారు బలవంతం చేయడంతో బుధవారం మధ్యాహ్నం ఆ ఇద్దరు బాలికలు వారి ఇంటికి కిలో మీటరు దూరంలోని చెరకు తోటకు వెళ్లారని, అక్కడ వారిపై అత్యాచారం జరిపిన అనంతరం, గొంతు నులిమి చంపేశారని పోలీసులు వివరించారు. ఆ తరువాత, వారు ఈ సమాచారాన్ని వారి స్నేహితులు కరీముద్దీన్, ఆరిఫ్ లకు ఇచ్చారని, వారు వచ్చిన తరువాత వారంతా కలిసి, బాలికల మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారని వివరించారు. ఈ విషయాన్ని విచారణలో జునాయిద్, సొహాయిల్ అంగీకరించారని వెల్లడించారు. బుధవారం రాత్రి జునాయిద్ పారిపోతుండగా, కాలిపై కాల్పులు జరిపి, అదుపులోకి తీసుకున్నామన్నారు. అయితే, తమ కూతుళ్లను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని బాధిత బాలికల తల్లి ఆరోపించారు.

Dalit sisters raped and murdered in UP: గ్రామస్తుల ధర్నా

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబం, వారి గ్రామస్తులు నిఘాసన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. వారితో ఎస్పీ సంజీవ్ కుమార్, ఏసీపీ అరుణ్ చర్చలు జరిపి, దోషులకు సాధ్యమైనంత త్వరగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. దోషులకు ఉరిశిక్ష విధించాలని బాధిత బాలికల తండ్రి డిమాండ్ చేశారు. ‘నా కూతుళ్లను ఇంటి నుంచి బలవంతంగా తీసుకువెళ్లి, రేప్ చేసి, చంపేశారు. వారికి ఉరిశక్ష విధించాలి` అన్నారు.

Dalit sisters raped and murdered in UP: హథ్రాస్ గ్యాంగ్ రేప్ వంటిదే..

ఈ సమాచారం తెలియగానే సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీజేపీ పాలనలో యూపీలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. ఈ ఘటన గతంలో సంచలనం సృష్టించిన హాథ్రాస్ సామూహిక అత్యాచారం వంటి దారుణ నేరమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ దారుణంపై స్పందించారు. ‘ఇద్దరు దళిత బాలికలను పట్టపగలు కిడ్నాప్ చేసి, తీసుకెళ్లి, హత్యాచారం చేయడం రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల దుస్థితిని తెలియజేస్తుందని ఆమె ట్వీట్ చేశారు. `పేపర్లలో ప్రచారం చేసుకోవడం కాదు.. మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోండి` అని సూచించారు.

Dalit sisters raped and murdered in UP: రాజకీయం చేయకండి

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చండి. కానీ ఈ ఘటనను రాజకీయం చేయకండి` అని విపక్షాలకు సూచించారు.

తదుపరి వ్యాసం