తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Zomato Premium : జొమాటో యూజర్స్​కు షాక్​.. ఆ సేవలు నిలిపివేత!

Zomato Premium : జొమాటో యూజర్స్​కు షాక్​.. ఆ సేవలు నిలిపివేత!

Sharath Chitturi HT Telugu

22 August 2022, 15:00 IST

    • Zomato Premium membership : మీరు జొమాటో ప్రీమియం సేవలు పొందుతున్నారా? మీ వద్ద జొమాటో ప్రో- జొమాటో ప్రో ప్లస్​ మెంబర్​షిప్స్​ ఉన్నాయా? ఇక మీరు ఆ సేవలు వినియోగించుకోలేరు.
జొమాటో ప్రీమియం సేవలను నిలిపివేత!
జొమాటో ప్రీమియం సేవలను నిలిపివేత! (REUTERS)

జొమాటో ప్రీమియం సేవలను నిలిపివేత!

Zomato Premium membership : జొమాటో ప్రీమియం సేవలు పొందుతున్న యూజర్లకు అలర్ట్​! జొమాటో ప్రీమియం సేవలు నిలిచిపోయాయి. జొమాటో ప్రో, ప్రో ప్లస్​ను నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ సోమవారం వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

2020 ముందు వరకు జొమాటో 'గోల్డ్​' అందుబాటులో ఉండేది. దానిని అప్​గ్రేడ్​ చేసి.. జొమాటో ప్రోని 2020లో తీసుకొచ్చారు.

"జొమాటో ప్రో/ ప్రో ప్లస్​ సేవలను రెన్యువెల్​ చేసుకోలేరు. ఈ సేవలను నిలిపివేస్తున్నాము. యూజర్లకు సరికొత్త అనుభూతిని తీసుకొచ్చే విధంగా.. మా సంస్థ కృషి చేస్తోంది. సరికొత్త అప్డేట్​తో మీ ముందుకొస్తాము," అని సంస్థ ప్రకటన చేసింది.

Zomato pro membership : మీడియా కథనాల ప్రకారం.. సరికొత్త ప్రోగ్రామ్​ను తీసుకొచ్చేందుకు.. రెస్టారెంట్​ భాగస్వాములతో జొమాటో ప్రణాళికలు రచిస్తోంది.

జొమాటో ప్రో.. జొమాటో ప్రో ప్లస్​

జొమాటో ప్రో తీసుకునే వారికి.. అనేక రెస్టారెంట్ల నుంచి అదనపు లబ్ధిచేకూరేది. డైనింగ్​, రెస్టారెంట్లు, కేఫ్​లు, బార్స్​తో పాటు ఇతర హోటళ్లలో వారికి అదనంగా ప్రయోజనాలు ఉండేవి. డెలివరీ మీద ఎక్స్​క్లూజివ్​ ఆఫర్లు కూడా లభించేవి. ఇతర జొమాటో యూజర్లతో పోల్చుకుంటే ఇవి మరింత ప్రత్యేకంగా ఉండేవి.

జొమాటో ప్రో మేంబర్​షిప్​ ఉంటే.. డెలివరీలో ప్రాధాన్యత లభించేది. అంటే.. సాధారణ యూజర్​ కన్నా.. ప్రో డెలివరీ మెంబర్​కు ఆర్డర్​ నుంచి డెలివరీ వరకు అనేక సౌలభ్యాలు ఉండేవి. సాధారణ యూజర్​ కన్నా జొమాటో ప్రో మెంబర్​కు 15-20శాతం వేగంగా డెలివరీ అందేది.

ఇప్పుడు జొమాటో ప్రో సేవలను నిలిచిపోవడంతో వినియోగదారులు ఆలోచనలో పడ్డారు. జొమాటో.. ఎలాంటి ప్లాన్లు వేస్తోందో అని అనుకుంటున్నారు.

Zomato share price : ఇక స్టాక్​ మార్కెట్​లో జొమాటో షేరు ధర విషయానికొస్తే.. ప్రస్తుతం రూ. 60.95 వద్ద ట్రేడ్​ అవుతోంది. జొమాటో షేరు ధర ఆల్​టైమ్​ హై రూ. 169గా ఉంటే.. కనిష్ఠం రూ. 40.60గా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం