తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Zomato Q1 Results : మరింత తగ్గిన జొమాటో నష్టాలు.. ఫుడ్​ డెలివరీలో బ్రేక్​ఈవెన్​!

Zomato Q1 results : మరింత తగ్గిన జొమాటో నష్టాలు.. ఫుడ్​ డెలివరీలో బ్రేక్​ఈవెన్​!

Sharath Chitturi HT Telugu

01 August 2022, 19:19 IST

  • Zomato Q1 results : జొమాటో నష్టాలు మరింత తగ్గాయి. ఈ మేరకు 2022-23 మొదటి త్రైమాసిక ఫలితాలను సంస్థ సోమవారం ప్రకటించింది.

జొమాటో క్యూ1 ఫలితాలు విడుదల
జొమాటో క్యూ1 ఫలితాలు విడుదల (REUTERS)

జొమాటో క్యూ1 ఫలితాలు విడుదల

Zomato Q1 results : 2022-23 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసిక ఫలితాలను జొమాటో సంస్థ సోమవారం విడుదల చేసింది. జొమాటో నష్టం రూ. 185.7కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జొమాటో కన్సాలిడేటెడ్​ లాస్​ రూ. 356.2కోట్లుగా ఉండేది. ఇక మార్చ్​ నెలతో ముగిసిన త్రైమాసికంలో జొమాటో సంస్థ.. రూ. 359.7కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఏప్రిల్​-జూన్​ త్రైమాసికంలో ఏకీకృత ఆదాయం రూ. 1,413.9కోట్లుగా నిలిచింది. గతేడాది ఇదే త్రైమాసికంతో(రూ. 844.4కోట్లు) పోల్చితే ఇది 67.4శాతం ఎక్కువ! మార్చ్​ నెలతో ముగిసిన త్రైమాసికంతో(రూ. 1,211.8కోట్లు) పోల్చుకుంటే ఇది 16.68శాతం వృద్ధి చెందినట్టు.

ఫుడ్​ డెలివరీ బిజినెస్​లో నష్టాలను తగ్గించుకుంది జొమాటో. క్యూ1 త్రైమాసికంలో ఎబిట్​డా లాస్​ రూ. 150కోట్లకు తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 170కోట్లుగా ఉండేది. కాగా.. ఈసారి ఫుడ్​ డెలివరీ విభాగంలో బ్రేక్​ఈవెన్​ సాధించినట్టు జొమాటో వెల్లడించింది. అడ్జస్టెడ్​ ఎబిట్​డా 0గా ఉందని పేర్కొంది. మార్చ్​ నెల త్రైమాసికంలో అది రూ.80కోట్లుగా నమోదైంది.

"మార్కెట్​లో పరిస్థితులకు తగ్గట్టు.. ప్రాఫిటెబులిటీపై కొన్ని నెలలుగా మా దృష్టి మారింది. దీర్ఘకాలం వృద్ధిని దృష్టిలో పెట్టుకుని వనరులను ఉపయోగించుకుంటున్నాము," అని జొమాటో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్​ గోయల్​ వెల్లడించారు.

జొమాటోలోని హైపర్​ప్యూర్​ విభాగం రానున్న రోజుల్లో మెరుగ్గా రాణిస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.

బ్లింకిట్​ గురించి..

Zomato share price : "బ్లింకిట్​ ఒప్పందం కోసం షేర్​హోల్డర్ల మద్దతు లభించింది. 97శాతం ఓట్లు.. ఒప్పందానికి అనుకూలంగా పడ్డాయి. ఒప్పందం ముగిసిన తర్వాత.. బ్లింకిట్​ ఫైనాన్షియల్స్​.. జొమాటోలోకి కన్సాలిడేట్​ అవుతాయి," అని జొమాటో వివరించింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసేసరికి.. బీఎస్​ఈలో జొమాటో షేర్​ ప్రైజ్​ రూ. 46.35కి చేరింది. జొమాటో మార్కెట్​ క్యాపిటల్​ రూ. 36,494.39కోట్లుగా ఉంది.

తదుపరి వ్యాసం