తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Strongest Passport List: పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ లో మనమెక్కడో తెలుసా?

strongest passport list: పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ లో మనమెక్కడో తెలుసా?

HT Telugu Desk HT Telugu

12 January 2023, 16:50 IST

google News
  • strongest passport list: శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల జాబితాలో జపాన్ తొలి స్థానంలో నిలిచింది. తరువాత స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియా నిలిచాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

strongest passport list: ఏ పాస్ పోర్ట్ తో వీసా అవసరం లేకుండానే ప్రయాణించగల దేశాల సంఖ్యను, లేదా వీసా ఆన్ అరైవల్ సదుపాయం ఉన్న దేశాల సంఖ్యను ఆధారంగా చేసుకుని అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల (world's most powerful passport) జాబితాను రూపొందించారు. International Air Transport Association (IATA) ఇచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ జాబితా రూపుదిద్దుకుంది.

Japan tops strongest passport list: వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్

ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను ప్రతీ సంవత్సరం లండన్ కు చెందిన హెన్లీ అండ పార్ట్ నర్స్ (Henley & Partners) సంస్థ రూపొందిస్తుంది. ఈ జాబితాలో ఈ సంవత్సరం తొలి స్థానంలో జపాన్ నిలిచింది. ఈ పాస్ పోర్ట్ తో ప్రపంవ్యాప్తంగా 193 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ప్రయాణం చేయవచ్చు. 192 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ప్రయాణం చేసే వీలున్న సింగపూర్, దక్షిణ కొరియా దేశాల పాస్ పోర్ట్ ఈ జాబితాలో రెండో స్థానం సంపాదించాయి. తరువాత స్థానాల్లో 187 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ప్రయాణం చేసే అవకాశమున్న ఫ్రాన్స్, ఐర్లాండ్, పోర్చుగల్, యూకే నిలిచాయి. ఆ తరువాత స్థానాల్లో అమెరికా, బెల్జియం, న్యూజీలాండ్, నార్వే, చెక్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్ దేశాల పాస్ పోర్ట్స్ ఉన్నాయి.

India's place in strongest passport list: భారత్ స్థానం..

ఈ ప్రపంచ శక్తిమంతమైన పాస్ పోర్ట్స్ జాబితాలో భారత్ 85వ స్థానంలో నిలిచింది. భారతదేశ పాస్ పోర్ట్ ఉన్నవారు 59 దేశాలకు వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ సదుపాయంతో ప్రయాణం చేయవచ్చు. ఈ దేశాల్లో శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, ఇండోనేషియా, కాంబోడియా, థాయిలాండ్, మారిషస్, సీషెల్స్, కెన్యా, ఉగాండా, ఖతార్, ఇరాన్ తదితర దేశాలున్నాయి. గత సంవత్సరం ఈ జాబితాలో భారత్ స్థానం 83.

worst passports: వరస్ట్ పాస్ పోర్ట్ దేశాలివి..

ఈ జాబితాలో అఫ్గనిస్థాన్ చివరి స్థానంలో ఉంది. ఈ దేశ పాస్ పోర్ట్ తో 27 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. అఫ్గాన్ కన్నా ముందు ఇరాక్ ఉంది.

తదుపరి వ్యాసం