Agniveer trainee dies: అగ్నివీర్ శిక్షణ పొందుతున్న యువతి అనుమానాస్పద మృతి
28 November 2023, 16:05 IST
- Agniveer trainee dies: నౌకాదళంలో అగ్నివీర్ శిక్షణ పొందుతున్న యువతి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.
ప్రతీకాత్మక చిత్రం
Agniveer trainee dies: అగ్నివీర్ గా భారతీయ నౌకాదళంలో చేరి ముంబైలో శిక్షణ పొందుతున్న కేరళకు చెందిన యువతి తన హాస్టల్ రూమ్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు.
కేరళ యువతి
స్థానిక పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఆ యువతి భారతీయ నౌకాదళంలో అగ్నివీర్ (Agniveer trainee dies) గా ఎంపికయ్యారు. రెండు వారాల క్రితం శిక్షణ నిమిత్తం ముంబైకి వచ్చారు. నౌకాదళంలో అగ్నివీర్ ప్రొగ్రామ్ కు ఎంపికైన మరో 20 మంది యువతులతో కలిసి ఆమె ముంబై లోని నేవీ హాస్టల్ లో ఉంటున్నారు.
అనుమానాస్పద మృతి
ముంబైలోని మలాద్ వెస్ట్ లో ఉన్న ఐఎన్ఎస్ హమ్లా హాస్టల్ గదిలో బుధవారం ఉదయం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. సీలింగ్ కు దుప్పటి మెడకు చుట్టుకుని వేలాడుతున్న ఆమె మృతదేహాన్ని ఆమెతో పాటు శిక్షణలో ఉన్న సహచరులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు పంపించారు. ఆ యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందరినీ ప్రశ్నిస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని, ప్రాథమికంగా నిర్ధారించామని వెల్లడించారు.
అగ్నివీర్ స్కీమ్
త్రివిధ దళాల్లో సైనికుల రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ స్కీమ్ ను ప్రారంభించింది. గతంలో ఉన్న రిక్రూట్మెంట్ విధానాన్ని సమూలంగా మార్చి ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ విధానం ప్రకారం.. త్రివిధ దళాల్లో అగ్నివీర్ లుగా చేరిన వారిలో నాలుగేళ్ల తరువాత, 25% మందిని రెగ్యులర్ సర్వీస్ లో కొనసాగిస్తారు.