Agniveer Recruitment 2023: అగ్నివీర్ ల రిక్రూట్మెంట్ కు భారతీయ నౌకాదళం నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్నివీర్ పోస్ట్ ల కు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 26 నుంచి భారతీయ నౌకాదళ అధికారిక వెబ్ సైట్ joinindiannavy.gov.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతీయ నౌకాదళంలో అగ్నివీర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జులై 2, 2023. ఈ పోస్ట్ లకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 26 నుంచి భారతీయ నౌకాదళ అధికారిక వెబ్ సైట్ joinindiannavy.gov.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన మెరిట్ లిస్ట్ ఈ సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ నేవీలో అగ్నివీర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే, అభ్యర్థులు 2002 నవంబర్ 1వ తేదీ నుంచి 2006 ఏప్రిల్ 30 వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత స్త్రీలు, అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
భారతీయ నౌకాదళంలో అగ్నివీర్ పోస్ట్ లకు ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్, ఫైనల్ స్క్రీనింగ్ టెస్ట్ లలో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్ లో శారీరక దారుఢ్య పరీక్షలు ఉంటాయి. వాటలో కచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. వేకేన్సీల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ను ప్రిపేర్ చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇండియన్ నేవీ వెబ్ సైట్ లోని సమగ్ర నోటిఫికేషన్ ను పరిశీలించండి.