తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mother Fights Tiger | ఏడాది బిడ్డపై పులి దాడి.. ఆ తల్లి సాహసం అద్భుతం

Mother fights Tiger | ఏడాది బిడ్డపై పులి దాడి.. ఆ తల్లి సాహసం అద్భుతం

HT Telugu Desk HT Telugu

07 September 2022, 16:00 IST

    • Mother fights Tiger to save her child | పులి దాడి నుంచి బిడ్డ ప్రాణాన్ని సాహసోపేతంగా కాపాడుకున్న తల్లి కథ ఇది. పిల్లల ప్రాణాల కోసం తల్లి ఏ స్థాయి సాహసానికైనా సిద్ధంగా ఉంటుందని నిరూపించిన కథనం ఇది. వట్టి చేతులతో పులిని ఎదిరించి బిడ్డను కాపాడుకున్న మధ్యప్రదేశ్ గిరిజన మహిళ సాహసం ఇది.
పులిని ఎదిరించిన మహిళ
పులిని ఎదిరించిన మహిళ

పులిని ఎదిరించిన మహిళ

మధ్యప్రదేశ్ లో పొలంలో పని చేసుకుంటున్న మహిళ, ఆమె ఏడాది కుమారుడిపై పులి దాడి చేసింది. ఆ దాడిని ఆ తల్లి సాహసోపేతంగా ఎదుర్కొని బిడ్డ ప్రాణాన్ని కాపాడుకుంది.

Mother fights Tiger to save her child | టైగర్ రిజర్వ్ దగ్గరలో..

మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఉంది. దాని పేరు బంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్. ఆ రిజర్వ్ కు వెలుపల కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒకటి రోహనియా. అక్కడ నివాసం ఉండే ఒక మహిళ ఇటీవల తన ఏడాది కొడుకుతో పొలం పనికి వెళ్లింది. అక్కడ ఆమె పని చేస్తుండగా, ఒక పులి ఒక్కసారిగా ఆమె కుమారుడిపై దాడి చేసింది. ఆ చిన్నారిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన ఆ తల్లి పులికి ఎదురు నిలిచింది.

Mother fights Tiger to save her child | నిరాయుధంగా..

చేతిలో ఏ ఆయుధం లేకున్నా.. కొడుకును పొత్తిళ్లలో పెట్టుకుని పులి దాడిని ఎదుర్కొంది. ఒళ్లంతా గాయాలైనా కొడుకును వదల్లేదు. సాయం కోసం గట్టిగా అరుస్తూ, పులి పంజాకు, కొడుకు ప్రాణానికి మధ్య తన ప్రాణాన్ని అడ్డుపెట్టింది. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు గట్టిగా అరుస్తూ, ఆ పులిని భయపెట్టి తరిమేశారు. వెంటనే ఆ మహిళను, ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు శరీరమంతా గాయాలు కాగా, ఆమె కొడుకు కు మాత్రం తలపై గాయమైంది. ఇద్దరు క్షేమంగానే ఉన్నారని వారు చికిత్స పొందుతున్న జబల్పూర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

Mother fights Tiger to save her child | ముందే చెప్పాం..

బంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ నుంచి బయటకు వచ్చిన ఒక పులి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న విషయాన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రచారం చేశామని బంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ అధికారులు తెలిపారు. అయితే, పులి తిరుగుతున్న విషయం తెలియని ఆ తల్లి ఏడాది కొడుకుతో పొలానికి వెళ్లి పులి దాడికి గురయ్యారు.

తదుపరి వ్యాసం