Wipro employees in Israel: ఇజ్రాయెల్ లో విప్రో ఉద్యోగులు..
10 October 2023, 14:07 IST
- Wipro employees in Israel: ఇజ్రాయెల్ లో తమ కంపెనీ ఉద్యోగులు 80 మంది ఉన్నారని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో వెల్లడించింది. వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపింది. పాలస్తీనాతో యుద్ధం (Israel Palestine war) కారణంగా ఇజ్రాయెల్ లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ప్రతీకాత్మక చిత్రం
Wipro employees in Israel: పాలస్తీనాతో యుద్ధం (Israel Palestine war) కారణంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఇజ్రాయెల్ లో ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ విప్రో ఉద్యోగులు 80 మంది ఉన్నారు. వారి వివరాలు, క్షేమ సమాచారాలు తెలుసుకున్నామని, అందరూ సేఫ్ గా ఉన్నారని విప్రో మంగళవారం వెల్లడించింది.
వర్క్ ఫ్రం హోం..
ఇజ్రాయెల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ పని చేస్తున్న తమ కంపెనీలోని ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని సూచించామని విప్రో వెల్లడించింది. మళ్లీ సమాచారం ఇచ్చేవరకు అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేయాలని మెయిల్ చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ లో విధుల్లో ఉన్న తమ ఉద్యోగులంతా ఇజ్రాయెల్ (Israel) దేశస్తులేేనని విప్రో తెలిపింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వారంతా క్షేమంగానే ఉన్నారని వెల్లడించింది. వారి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ మానవ వనరుల విభాగం తెలుసుకుంటోందని తెలిపింది. అయితే, ఇజ్రాయెల్ లో కొందరు ఇండియన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక విప్రో ఉద్యోగి వెల్లడించారు. వారు వారి కుటుంబాలతో పాటు ఇజ్రాయెల్ లో ఉంటున్నారని చెప్పారు.
18 వేల మంది..
ఇజ్రాయెల్ లో దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వారిలో వివిధ ఐటీ కంపెనీల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తమ ఉద్యోగుల సేఫ్టీపై ఆయా ఐటీ కంపెనీలు సమీక్షిస్తున్నాయి. ఇజ్రాయెల్ లో విధుల్లో ఉన్న తమ స్టాఫ్ ను విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇప్పటికే భారత్ కు తరలించింది. ఇందుకు ఇథియోపియా ఎయిర్ లైన్స్ సహకారాన్ని ఎయిర్ ఇండియా తీసుకుంది.