ఇజ్రాయిల్-హమాస్ మధ్య యుద్ధం 4వ రోజుకి చేరింది. ఇప్పటికిప్పుడు ఈ యుద్ధానికి ముగింపు ఉండేలా కనిపించటం లేదు. గాజాలోని హమాస్ టెర్రర్ గ్రూప్ రహస్య స్థావరాలపై ఇజ్రాయిల్ పోరాటం చేస్తూనే ఉంది. ఈ యుద్ధంలో దాదాపు 1500 మందికిపైగానే మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. ఇజ్రాయిల్ కు అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తున్నప్పటికీ, హమాస్ టెర్రర్ గ్రూప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇజ్రాయిల్ దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రతిసారి తమ చేతిలో బందీలుగా ఉన్న వారిని ఉరి తీస్తామని హమాస్ టెర్రర్ గ్రూప్ బెదిరిస్తోంది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని.. కానీ దానిని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు.