తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Vs Iran : పాకిస్థాన్​- ఇరాన్​లు ఎందుకు గొడవపడుతున్నాయి?

Pakistan vs Iran : పాకిస్థాన్​- ఇరాన్​లు ఎందుకు గొడవపడుతున్నాయి?

Sharath Chitturi HT Telugu

19 January 2024, 9:05 IST

google News
    • Pakistan vs Iran : పాకిస్థాన్​- ఇరాన్​ మధ్య నెలకొన్న ఉద్రిక్తత.. సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దేశలు అసలు ఎందుకు గొడవపడుతున్నాయి?
పాకిస్థాన్​- ఇరాన్​లు ఎందుకు గొడవపడుతున్నాయి?
పాకిస్థాన్​- ఇరాన్​లు ఎందుకు గొడవపడుతున్నాయి? (Reuters)

పాకిస్థాన్​- ఇరాన్​లు ఎందుకు గొడవపడుతున్నాయి?

Pakistan vs Iran latest updates : పాకిస్థాన్​- ఇరాన్​ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- పాకిస్థాన్​ల మధ్య సైనిక దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండటానికి ఇరు దేశాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, పొరుగు సంబంధాల సూత్రాలకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య అన్ని భద్రతా సమస్యలను శాంతియుత మార్గాల ద్వారా, చర్చలు, సహకారం ద్వారా పరిష్కరించుకోవాలని ఆంటోనెయి గుటెరస్​ అభిప్రాయపడ్డారు.

పాకిస్థాన్​ భూభాగంలో ఇరాన్ వైమానిక దాడి చేయడం, అందుకు బదులుగా.. పాక్​ ప్రతిఘటించడంతో.. అక్టోబర్​లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమాసియాలో నెలకొన్నఅస్థిరత మరింత ఆందోళనకరంగా మారినట్టు అయ్యింది.

ఇరాన్, పాకిస్థాన్​ ఎందుకు గొడవపడుతున్నాయి?

Iran Pakistan war : నైరుతి పాకిస్థాన్​లోని ఉగ్రవాద స్థావరాలపై ఇరాన్ మంగళవారం దాడి చేయడం ఆ ప్రాంతంలో ప్రకంపనలు సృష్టించింది. దాడికి పాల్పడిన సున్నీ ఉగ్రవాది జైషే అల్-అద్ల్ గ్రూపుకు ఇస్లామిక్ స్టేట్​తో సంబంధాలు ఉన్నాయని, జనవరి 3న కెర్మాన్​లో జరిగిన బాంబు దాడిలో పాత్ర ఉందని టెహ్రాన్ ఆరోపించింది.

24 గంటల్లోనే స్పందించిన పాక్.. తన నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్​లో తిరుగుబాటుకు మద్దతిస్తున్న వేర్పాటువాద మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుంది. 1980-88 ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ గడ్డపై జరిగిన తొలి వైమానిక దాడి ఇదే కావడం గమనార్హం.

Iran Pakistan conflict : ఇరాన్ వైమానిక దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని పాకిస్థాన్​ చెబుతుండగా, ప్రతీకార దాడిలో మహిళలు, పిల్లలు సహా తొమ్మిది మంది మరణించారని టెహ్రాన్ తెలిపింది. దీనికి నిరసనగా ఇస్లామాబాద్ ఇరాన్​లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. ఇరాన్ సైతం..తమ దేశంలోని పాకిస్థాన్ సీనియర్ దౌత్యవేత్తను వివరణ కోరింది.

వేర్పాటువాద గ్రూపులు, ఇస్లామిక్ మిలిటెంట్లు చాలా కాలంగా ప్రభుత్వ స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇందులో పాకిస్థాన్- ఇరాన్ అధికారులు ప్రమేయం ఉందని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Pakistan vs Iran conflict : రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2020లో యుఎస్ డ్రోన్ చేతిలో మరణించిన కమాండర్ ఖాసిం సులేమానీ జ్ఞాపకార్థం ఆగ్నేయ ఇరాన్ నగరం కెర్మాన్​లో జనవరి 3న జరిగిన ఒక కార్యక్రమంలో దాదాపు 100 మంది మరణించారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ తీవ్రవాద సున్నీ ముస్లిం మిలిటెంట్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్​పై ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ ప్రకటించింది.

కెర్మాన్ దాడితో జైషే అల్-అద్ల్​కు సంబంధం ఉన్న ఆధారాలను ఇరాన్ పాకిస్థాన్​కు అందించిందని, ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఇరాన్ కోరిందని ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి ఒకరు వెల్లడించారు.

తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఏదైనా చేస్తే.. ప్రతిఘటించి బుద్ధిచెబుతామని.. తాజా దాడులతో ఇరాన్​ మరోమారు నిరూపించింది!

తదుపరి వ్యాసం