తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nithyananda's Kailasa: ఇంతకీ నిత్యానంద దేశం ‘కైలాస’ ఎక్కడుంది? పౌరసత్వం ఎలా?

Nithyananda's Kailasa: ఇంతకీ నిత్యానంద దేశం ‘కైలాస’ ఎక్కడుంది? పౌరసత్వం ఎలా?

HT Telugu Desk HT Telugu

03 March 2023, 19:51 IST

google News
    • Nithyananda's Kailasa: వివాదాస్పద స్వామి నిత్యానంద భారత్ నుంచి పారిపోయి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ‘కైలాస’ దేశం ఇటీవల మరోసారి వార్తల్లోకి వచ్చింది. 
స్వామి నిత్యానంద
స్వామి నిత్యానంద

స్వామి నిత్యానంద

Nithyananda's Kailasa: ఫిబ్రవరి రెండో వారంలో జెనీవాలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న ఒక మహిళ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎవరు? ఏ దేశం నుంచి వచ్చారు? లాంటి ప్రశ్నలతో గూగుల్ ను ముంచెత్తారు.

Representative of Kailasa in the UN: నిత్యానంద ప్రతినిధిగా..

విజయప్రియ నిత్యానంద అనే పేరున్న ఆ యువతి వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సృష్టించిన దేశమైన కైలాస నుంచి ఐరాస సదస్సుకు వచ్చారు. అంటే కైలాస దేశ ప్రతినిధిగా ఆమె ఐరాస సమావేశంలో పాల్గొన్నారు. దాంతో, ఒక్కసారిగా, నిత్యానంద దేశం కైలాస కు ఐరాస గుర్తింపు లభించిందా? అన్న ప్రశ్న తలెత్తింది. అయితే, అలాంటిదేమీ లేదని తరువాత స్పష్టమైంది.

where is Nithyananda's Kailasa: కైలాస ఎక్కడుంది?

హిమాలయ పర్వతాల్లోని కైలాస పర్వతం స్ఫూర్తిగా, పరమ శివుడి నివాసమైన కైలాసం స్ఫూర్తితో తను ఏర్పాటు చేసుకున్న దేశానికి కైలాస అని నిత్యానంద పేరు పెట్టారు. అయితే, ఆ ప్రదేశం ఎక్కడుందనే విషయంలో కొంత గందరగోళం ఉంది. చివరకు ఈక్వెడార్ సమీపంలోని ఒక దీవిలో నిత్యానంద కైలాసను ఏర్పాటు చేసుకున్నారని తేలింది. ఆయన ఆ దీవిని ఈక్వెడార్ నుంచి కొనుగోలు చేశారని భావిస్తున్నారు. అయితే, అక్కడ నిజంగా నిత్యానంద, ఆయన అనుచరులు ఉంటున్నారా? లేక అది ఒక వర్చువల్, ఫిక్షనల్ దేశమా? అనే విషయంలోనూ భిన్న వాదనలున్నాయి.

what is Nithyananda's Kailasa: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస

కైలాస అనేది హిందువుల పరిరక్షణ, హిందు మత పరిరక్షణ కోసం కెనడా, యూఎస్ లోని ఆది శైవ మైనారిటీ హిందువులు ప్రారంభించిన ఉద్యమమని కైలాస వెబ్ సైట్ లో ఉంటుంది. ఇక్కడ హిందూ మతాన్ని విశ్వసించే, ఆచరించే వారికి కుల, మత, ప్రాంత, లింగ విబేధం లేకుండా అనుమతి ఉంటుందని అందులో ఉంది. ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస(USK) కు వెళ్లాలనుకున్నా, అక్కడి పౌరసత్వం కావాలనుకున్నా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ వీసా, ఈ సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దేశానికి ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక ప్రభుత్వ వ్యవస్థ, ప్రత్యేక పాస్ పోర్ట్ మొదలైనవి ఉన్నాయి.

Nithyananda's Kailasa: ఇంతకీ ఈ దేశానికి గుర్తింపు ఉందా?

ఇంతకీ ఈ దేశానికి గుర్తింపు ఉందా? అని ప్రశ్నిస్తే లేదనే చెప్పాలి. ఇప్పటివరకు ఏ అంతర్జాతీయ సంస్థ కూడా కైలాసను దేశంగా గుర్తించలేదు. అయితే, ఇలాంటి గుర్తింపు లేని, దేశాలుగా పరిగణించని ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా 80 వరకు ఉన్నాయి. వాటిని మైక్రో నేషన్స్ (micro nations) అని పిలుస్తారు. 1980 ప్రాంతంలో ఆధ్యాత్మిక గురు రజినీశ్ ఒరెగావ్ లో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ప్రాంతానికి కూడా ప్రత్యేక పోలీసు వ్యవస్థ, ప్రత్యేక ప్రజా రవాణా వ్యవస్థ ఉండేవి.

తదుపరి వ్యాసం