'Kailasa' At UN Meet: ఐక్యరాజ్య సమితిలో నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధి..-nithyanandas republic of kailasa representatives participated in a un meet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'Kailasa' At Un Meet: ఐక్యరాజ్య సమితిలో నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధి..

'Kailasa' At UN Meet: ఐక్యరాజ్య సమితిలో నిత్యానంద దేశం ‘కైలాస’ ప్రతినిధి..

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 05:25 PM IST

'Kailasa' At UN Meet: భారత్ నుంచి పారిపోయి స్వయంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న స్వామి నిత్యానంద తాజాగా తన ప్రతినిధి బృందాన్ని ఐక్యరాజ్య సమితికి పంపించారు.

ఐరాస సదస్సులో స్వామి నిత్యానంద దేశమైన ‘కైలాస’ ప్రతినిధి
ఐరాస సదస్సులో స్వామి నిత్యానంద దేశమైన ‘కైలాస’ ప్రతినిధి

స్వామి నిత్యానంద ఏర్పాటు చేసుకున్న దేశం ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస (Republic Of Kailasa)’ కు చెందిన ఒక ప్రతినిధి బృందం ఐక్యారజ్య సమితి నిర్వహించిన ఒక సదస్సులో (UN Meeting) పాల్గొనడం సంచలనం సృష్టించింది. నిత్యానంద (Nithyananda) సృష్టించుకున్న దేశమైన ‘కైలాస’ కు ఐక్యరాజ్య సమితి గుర్తింపు లభించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయతే, గుర్తింపు ఇచ్చినట్లగా ఐరాస నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

Nithyananda's Representatives at UN: ఐరాసలో..

తాజాగా ఫిబ్రవరి 24న ఐక్యరాజ్య సమితిలో జరిగిన ఒక సదస్సు (UN Meeting) లో స్వామి నిత్యానంద (Nithyananda) దేశమైన కైలాస నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఐరాస సదస్సుకు అందరూ మహిళలే ఉన్న ఒక ప్రతినిధి బృందాన్ని స్వామి నిత్యానంద పంపించారు. ఆ సదస్సులో పాల్గొన్న యువతి ప్రసంగిస్తున్న వీడియో,ఫొటోలు ఐరాస వెబ్ సైట్ లో ఉన్నాయి. నిత్యానంద (Nithyananda) కు రక్షణ కల్పించాలని ఆమె ఆ సదస్సులో డిమాండ్ చేశారు. హిందూ మత పరిరక్షకుడైన తమ నాయకుడు స్వామి నిత్యానంద (Nithyananda) కొన్ని ఏళ్లుగా వేధింపులను ఎదుర్కొంటున్నారని, వాటిని నియంత్రించే దిశగా ఐరాస చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. స్వామి నిత్యానంద జన్మించిన దేశంలోనే ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారన్నారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి కమిటీ (United Nations Committee on Economic, Social and Cultural Rights CESCR) సమావేశం జెనీవాలో జరిగింది. ఆ సమావేశంలో నిత్యానంద దేశం కైలాస నుంచి ప్రతినిధి బృందం పాల్గొన్నది.

Kailasa Representatives at UN నిత్యానంద ట్విటర్ లో కూడా..

ఐక్యరాజ్య సమితి సదస్సు (UN Meeting)లో తమ ప్రతినిధి బృందం పాల్గొన్న ఫొటోలను స్వామి నిత్యానంద (Nithyananda) తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే, ఆ సమావేశంలో పాల్గొన్న తన ప్రతినిధులు మాట్లాడిన విషయాలను కూడా పోస్ట్ చేశారు. విధాన నిర్ణయ వ్యవస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచాలన్న అంశంపై జరిగిన చర్చలో స్వామి నిత్యానంద ప్రతినిధులు పాల్గొన్నారు. నిత్యానంద దేశమైన కైలాస తరఫున చీర, ఆభరణాలు, తలపాగా ధరించిన ఒక యువతి ఐరాస సదస్సు (UN Meeting) లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలను ఐరాస వెబ్ సైట్ లో ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి కోసం తమ దేశం చేపట్టిన చర్యలను ఆమె ఆ సదస్సు (UN Meeting) లో వివరించారు. తమ దేశంలో నిత్యావసరాలైన ఆహారం, వస్త్రాలు, నివాసం, విద్య, వైద్యం.. అన్నీ ఉచితమేనని ఆమె వెల్లడించారు. సంప్రదాయ హిందుత్వ విధానాల పునరుద్ధరణ కోసం స్వామి నిత్యానంద కృషి చేస్తున్నారని వివరించారు.

Rape case on Nithyananda in India: రేప్ కేసు

కొన్ని సంవత్సరాల క్రితమే వివాదాస్పద స్వామీజీ నిత్యానంద (Nithyananda) భారత్ నుంచి పారిపోయారు. ఒక ద్వీపంలో సొంతంగా రిపబ్లిక్ ఆఫ్ కైలాస పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొంతంగా ప్రభుత్వాన్ని నియమించుకున్నారు. తన దేశంలో విద్య, వైద్యం, ఇతర సేవలన్నీ ఉచితమని ప్రకటించారు. నిత్యానంద (Nithyananda) వద్ద డ్రైవర్ గా పని చేసిన లెనిన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కర్నాటకలోని రామలింగారలో 2010లోనే నిత్యానందపై రేప్ కేసు నమోదై ఉంది. గతంలో ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసి, ఆ తరువాత బెయిల్ పై విడుదల చేశారు. దాంతో, స్వామి నిత్యానంద (Nithyananda) దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం భారత్ లో ఆయనపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయి ఉంది. ఇది కాకుండా, ఆయనపై పలు లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి.

Whats_app_banner