తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Whatsapp 4 New Features: కొత్త ఫీచర్లను లాంచ్ చేసిన వాట్సాప్.. ఎలా ఉపయోగపడతాయో చూడండి

WhatsApp 4 New Features: కొత్త ఫీచర్లను లాంచ్ చేసిన వాట్సాప్.. ఎలా ఉపయోగపడతాయో చూడండి

HT Telugu Desk HT Telugu

03 November 2022, 15:56 IST

google News
    • WhatsApp New Features: వాట్సాప్ కొత్తగా మరికొన్ని ఫీచర్లను లాంచ్ చేసింది. కమ్యూనిటీస్, ఇన్-చాట్ పోల్స్, వీడియో కాల్స్, గ్రూప్ మెంబర్స్ లిమిట్‍ను పెంచింది.
వాట్సాప్ సరికొత్త ఫీచర్లు
వాట్సాప్ సరికొత్త ఫీచర్లు (whatsapp)

వాట్సాప్ సరికొత్త ఫీచర్లు

WhatsApp 4 New Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‍కు కొత్త ఫీచర్లు యాడ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరిన్ని ఫీచర్లను వాట్సాప్ లాంచ్ చేసింది. యూజర్లకు నూతన సదుపాయాలను కల్పించేందుకు వీటీని తీసుకొచ్చింది. కమ్యూనిటీస్, ఇన్-చాట్ పోల్స్, 32 మంది ఉండేలా వీడియో కాల్స్, గ్రూప్ మెంబర్స్ లిమిట్ పెంపు ఫీచర్లను వాట్సాప్ ఆవిష్కరించింది. రానున్న వారాల్లో యూజర్లందరికీ ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఫీచర్ల వివరాలు, ఎలా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకోండి.

WhatsApp Communities: వాట్సాప్ కమ్యూనిటీస్

సపరేట్ గ్రూప్‍లను ఒకే గొడుగుకు కిందికి తెచ్చుకునేలా కమ్యూనిటీస్ ఫీచర్‍ను వాట్సాప్ తీసుకొచ్చింది. అంటే వేరేవేరే గ్రూప్‍లను ఒకే కమ్యూనిటీగా సెట్ చేసుకోవచ్చు. మొత్తం కమ్యూనిటీకి అప్‍డేట్‍లను పంపడం, రిసీవ్ చేసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. గ్రూప్‍లను ఆర్గనైజ్ చేసుకోవడం దీని వల్ల సులభతరం అవుతుంది.

మీకు అవసమైన సమాచారాన్నితెలుసుకునేందుకు కమ్యూనిటీలోని గ్రూప్స్ మధ్య సులభంగా స్విచ్ అవొచ్చు. కమ్యూనిటీలోని ప్రతీ ఒక్కరికీ అడ్మిన్ ముఖ్యమైన అప్‍డేట్‍లను సెండ్ చేయవచ్చు. కమ్యూనిటీలో ఏ గ్రూప్స్ ఉండాలనేది కూడా అడ్మిన్‍దే నిర్ణయంగా ఉంటుంది. చాట్స్ పక్కనే ఈ కమ్యూనిటీస్ ట్యాబ్ ఉంటుంది. టాప్‍లో ఉండే న్యూ కమ్యూనిటీస్‍పై ట్యాప్ చేసి.. కొత్త కమ్యూనిటీని క్రియేట్ చేసుకోవచ్చు.

WhatsApp in-chat polls: చాట్స్ లో పోల్స్

ఎంతోకాలంగా టెస్ట్ చేస్తున్న ఇన్-చాట్స్ పోల్స్ ఫీచర్‍ను వాట్సాప్ ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఇన్-చాట్ పోల్ ఫీచర్ ద్వారా ఏదైనా ప్రశ్నను క్రియేట్ చేసి చాట్‍లో సెండ్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రూప్‍లలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఏ విషయంపై అయినా అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రశ్నను క్రియేట్ చేసి..గ్రూప్‍లోని సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. ప్రశ్నకు 12 వరకు ఆప్షన్‍లు ఇవ్వొచ్చు. ట్విట్టర్, టెలిగ్రామ్‍ సహా పలు ప్లాట్‍ఫామ్‍ల్లో ఇప్పటికే ఇన్-చాట్ పోల్స్ లాంటి ఫీచర్ ఉంది.

WhatsApp Video Calling: వీడియో కాల్‍లో ఒకేసారి 32 మంది

వీడియో కాల్‍లో ఒకేసారి 32 మంది పార్పిసిపెంట్స్ పాల్గొనేలా లిమిట్‍ను పెంచింది వాట్సాప్. అంటే ఇక 32 మంది వాట్సాప్‍ వీడియో కాల్‍లో ముచ్చటించుకోవచ్చు.

WhatsApp Groups: గ్రూప్‍లో 1024 మంది

గ్రూప్‍లో మెంబర్ల పరిమితి రెట్టింపు చేసింది వాట్సాప్. ఇక నుంచి ఒక్కో వాట్సాప్ గ్రూప్‍లో 1024 మంది వరకు పార్పిసిపెంట్స్ ఉండొచ్చు.

ఈ కొత్త ఫీచర్లను వాట్సాప్ గ్లోబల్‍గా లాంచ్ చేసింది. క్రమంగా యూజర్లకు రోల్అవుట్ చేస్తోంది. రానున్న కొన్ని వారాల్లో యూజర్లందరికీ ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

కమ్యూనిటీగా గ్రూపులు
తదుపరి వ్యాసం