తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Noida Twin Towers Demolished : నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత.. లైవ్​ వీడియో

Noida twin towers demolished : నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత.. లైవ్​ వీడియో

Sharath Chitturi HT Telugu

28 August 2022, 14:52 IST

google News
    • Noida twin towers demolished : నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత ప్రక్రియ ముగిసింది. అన్ని జాగ్రత్తలతో అధికారులు.. నోయిడా ట్విన్​ టవర్స్​ను కూల్చివేశారు.
నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత దృశ్యాలు
నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత దృశ్యాలు (ANI)

నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత దృశ్యాలు

Noida twin towers demolished : దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత ప్రక్రియ ఆదివారం ముగిసింది. భారీ పేలుడు పదార్థాలను వినియోగించిన కారణంగా ట్విన్​ టవర్స్​.. కొన్ని క్షణాల్లోనే పేకమేడల్లా కుప్పకూలాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత ఇలా..

నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత ప్రక్రియ కోసం మొత్తం మీద 3,700కేజీల పేలుడు పదార్థాలను వినియోగించారు. స్తంభాలకు ఉన్న 7,000 రంధ్రాల్లో వీటిని అమర్చారు. ట్రిగ్గర్​ అయిన వెంటనే.. 'వాటర్​ఫాల్​ టెక్నిక్​' తరహాలో ఈ ట్విన్​ టవర్స్ 9 క్షణాల్లో​ కుప్పకూలాయి.

అంత భారీ భవనాలు కుప్పకూలడంతో పరిసర ప్రాంతాల్లో దుమ్ము, ధూళి అలుముకుంది. ఇది తగ్గేందుకు 12 నిమిషాలు పడుతుందని సమాచారం. భవనాలను పేల్చివేయడంతో.. 55వేల టన్నుల చెత్త ఏర్పడుతుందని తెలుస్తోంది.

Noida twin towers : నోయిడా ట్విన్​ టవర్స్​ కూల్చివేత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సమీపంలోని 7వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా.. వెంటనే స్పందించేందుకు సమీపంలో 8 అంబులెన్స్​లను ఏర్పాటు చేశారు. వివిధ ఆసుపత్రుల్లో పడకలను సైతం సిద్ధంగా ఉంచారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, డోర్లు, కిటికీలు మూసివేయాలని, ఎన్​-95 మాస్కులు వినియోగించాలని అధికారులు సూచనలు ఇచ్చారు.

ఎందుకు కూల్చివేశారు?

Noida twin tower demolition reason : నోయిడాలోని సూపర్​టెక్​ ఎమరాల్డ్​ కోర్ట్​లోని హౌజింగ్​ సొసైటీలో.. 14 భవనాల నిర్మాణం జరగాల్సి ఉంది. ప్రతి భవనంలో 9 ఫ్లోర్లు ఉండాలన్నది అసలు ప్రాన్​. దీనికి నోయిడా అధికారులు కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత.. ఈ 14 టవర్స్​లో.. ప్రతిదానికి 40 ఫ్లోర్లు ఉండే విధంగా డిజైన్​ని సవరించారు. అందులో భాగంగానే ప్రస్తుతం కూల్చివేసిన ట్విన్​ టవర్స్​ను కట్టేశారు.

కాగా.. ఈ వ్యవహారంపై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర నిరసన తెలిపారు. ఆమోదించిన దాని కన్నా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని అడ్డుకోవాలని 2012లో అలహాబాద్​ కోర్టుకు వెళ్లారు. అందుకు అంగీకరించిన కోర్టు.. వాటిని తొలగించాలని 2014లో సూపర్​టెక్​ గ్రూప్​నకు తీర్పునిచ్చింది.

ఆ తీర్పును సవాలు చేస్తూ.. సూపర్​టెక్​ గ్రూప్​.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నో ఏళ్ల విచారణ అనంతరం.. ఆయా భవనాలను సొంత ఖర్చులతో కూల్చివేయాలని సూపర్​టెక్​ గ్రూప్​నకు ఆదేశాలిచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.

Why twin tower Noida demolition : ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే.. ఆదివారం నోయిడా ట్విన్​ టవర్స్​ను కూల్చివేశారు అధికారులు. ఫలితంగా.. కుతుబ్​ మినార్​ కన్నా ఎత్తుగా ఉండే ఈ ట్విన్​ టవర్స్​ నెలమట్టమాయాయి. దేశ చరిత్రలోనే ఇంత ఎత్తైన భవనాలను పేల్చివేయడం ఇదే తొలిసారి.

<p>కూల్చివేతకు ముందు.. నోయిడా ట్విన్​ టవర్స్​ ఇలా ఉండేవి</p>

ఇంత జరిగినా.. తమ చర్యలను సూపర్​టెక్​ సంస్థ సమర్థించుకుంది! నోయిడా అధికారులు ఆమోదించిన బిల్డింగ్​ ప్లాన్​కు తగ్గట్టుగానే ట్విన్​ టవర్స్​ నిర్మాణం చేపట్టినట్టు పేర్కొంది.

తదుపరి వ్యాసం