తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Independence Day 2024: రేపే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ఆ రోజు ప్రత్యేకతలు ఇవే..

US Independence Day 2024: రేపే అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ఆ రోజు ప్రత్యేకతలు ఇవే..

HT Telugu Desk HT Telugu

03 July 2024, 15:19 IST

google News
    • మనకు ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం. అదే విధంగా అమెరికాకు జూలై 4వ తేదీ ఇండిపెండెన్స్ డే. అమెరికా ఇండిపెండెన్స్ డే కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ వివరాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం
జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం (Unsplash)

జూలై 4 అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం

అమెరికన్లు తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జూలై నాల్గవ తేదీన దేశభక్తితో జరుపుకుంటారు. ప్రజలు స్వాతంత్య్ర వైభవాన్ని ఆస్వాదిస్తూ వీధుల్లో ఊరేగింపులు, నినాదాలతో సంబరాలు చేసుకుంటారు. 248 సంవత్సరాల క్రితం, జూలై నాల్గవ తేదీన, స్వాతంత్య్ర ప్రకటన పత్రం ప్రచురించిన తరువాత, అమెరికా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈ ప్రత్యేకమైన రోజును సగర్వంగా, వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.

యుఎస్ ఇండిపెండెన్స్ డే 2024: తేదీ, చరిత్ర

ప్రతి సంవత్సరం, జూలై 4 న యుఎస్ ఇండిపెండెన్స్ డే (US Independence Day 2024) జరుపుకుంటారు. ఈ ఏడాది జూలై నాలుగో తేదీ గురువారం వస్తుంది. 1775 లో, కింగ్ జార్జ్ 3 నాయకత్వంలోని బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్య్రం పొందడానికి పదమూడు అమెరికన్ కాలనీల తిరుగుబాటుతో అమెరికన్ విప్లవం ప్రారంభమైంది. బ్రిటిష్ అణచివేత విధానాల నుంచి విముక్తి పొందాలనే దృఢ సంకల్పం, స్వపరిపాలన చేసుకోవాలనే ఆకాంక్ష ఈ స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపించింది. 1776 జూలై 2 న, అమెరికాలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్ ఓటు వేసింది. ఆ తరువాత 1776 జూలై 4 న, స్వాతంత్య్ర ప్రకటనను ఆమోదించి ప్రచురించారు. అలాగే, జూలై 8, 1776న ఆ స్వాతంత్య్ర ప్రకటనను బహిరంగంగా వినిపించారు. 1776 ఆగస్టు 2 న అమెరికా స్వాతంత్య్ర ప్రకటనపై అధికారికంగా సంతకాలు జరిగాయి.

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత

జూలై నాల్గవ తేదీ అమెరికా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. బ్రిటిష్ అణచివేత పాలన నుండి విముక్తి పొందింది. ఈ రోజున అమెరికన్లు దేశభక్తితో ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకుంటారు. జూలై నాల్గవ తేదీని దేశవ్యాప్తంగా కచేరీలు, నినాదాలు, పరేడ్ లు మరియు కుటుంబ సమావేశాలతో జరుపుకుంటారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్టాక్ మార్కెట్లు మూతపడటంతో దీనిని ఫెడరల్ సెలవు దినంగా పాటిస్తారు.

తదుపరి వ్యాసం