తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc 2023 Admit Card: యూపీఎస్సీ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ రెడీ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

UPSC 2023 admit card: యూపీఎస్సీ పరీక్ష అడ్మిట్ కార్డ్స్ రెడీ; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

14 November 2023, 15:19 IST

google News
  • UPSC 2023 admit card: ఐఎఫ్ఎస్ మెయిన్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధం చేసింది. నవంబర్ 17వ తేదీ నుంచి వాటిని అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

UPSC IFS Main exam 2023: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష, 2023 కోసం అడ్మిట్ కార్డ్స్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సిద్ధం చేసింది. ఈ అడ్మిట్ కార్డ్స్ ను నవంబర్ 17 న అధికారిక వెబ్ సైట్ upsc.gov.in లో అప్‌లోడ్ చేస్తుంది. అభ్యర్థులు నవంబర్ 17 నుంచి upsc.gov.in లేదా upsconline.nic.in వెబ్ సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ ఎప్పుడు?

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) (Indian Forest Service (Main) Examination, 2023) పరీక్ష నవంబర్ 26 వ తేదీన జరుగుతుంది. పరీక్ష రెండు సెషన్లలో, 3 గంటల చొప్పున నిర్వహిస్తారు. ఉదయం సెషన్ ఉదయం 09:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 02:30 నుంచి సాయంత్రం 05:30 వరకు జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ లో ఏవైనా తప్పులు ఉంటే అభ్యర్థులు వెంటనే యూపీఎస్సీకి soexam9-upsc@gov.in కు మెయిల్ చేసి, తమ అభ్యంతరాన్ని తెలియజేయాలి. అలాగే, పరీక్షకు అభ్యర్థులు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను తీసుకురావాలి.

How to download: ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

  • ముందుగా అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీ పై కనిపించే UPSC IFS Main exam admit card లింక్ పై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ఐడీ/ రోల్ నంబర్, పుట్టిన రోజు ఆధారంగా లాగిన్ కావాలి.
  • స్క్రీన్ పై ఐఎఫ్ఎస్ మెయిన్ అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
  • అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం ఒక కాపీని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.
  • పూర్తి వివరాల కోసం notice here

తదుపరి వ్యాసం