UPSC Recruitment 2023 : యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!-upsc recruitment 2023 apply for assistant director and other posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Recruitment 2023 : యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

UPSC Recruitment 2023 : యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

HT Education Desk HT Telugu
Nov 14, 2023 08:59 AM IST

UPSC Recruitment 2023 : యూపీఎస్​ఈ రిక్రూట్​మెంట్​ 2023 నోటిఫికేషన్​ విడుదలైంది. అప్లికేషన్​ ప్రక్రియ కూడా మొదలైంది. ఆ వివరాలు..

యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!
యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి!

UPSC Recruitment 2023 notification : వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది యూపీఎస్​సీ (యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​). అసిస్టెంట్​ డైరక్టర్​, డిప్యూటీ సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ హైడ్రోజియోలాజిస్ట్​ పోస్టుల కోసం అప్లికేషన్​ ప్రక్రియను మొదలుపెట్టింది. నవంబర్​ 30 వరకు ఈ అప్లికేషన్​ ప్రాసెస్​ కొనసాగుతుంది. upsc.gov.in లో అభ్యర్థులు.. తమ అప్లికేషన్లను దాఖలు చేసుకోవచ్చు.

యూపీఎస్​సీ రిక్రూట్​మెంట్​ 2023 వివరాలు..

పోస్టులు:- ఈ దఫా రిక్రూట్​మెంట్​లో 3 వేకెన్సీలను భర్తీ చేయాలని నిర్ణయించుకుంది యూపీఎస్​సీ. అవి.. అసిస్టెంట్​ డైరక్టర్​, డిప్యూటీ సెంట్రల్​ ఇంటెలిజెన్స్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ హైడ్రోజియోలాజిస్ట్​.

UPSC Recruitment 2023 notification pdf : అప్లికేషన్​ ఫీజు:- మహిళలు, ఎస్​సీ-ఎస్​టీ- వికలాంగులకు ఉచితం. ఇతరులు రూ. 25 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్​బీఐ బ్రాంచ్​లో లేదా నెట్​ బ్యాంకింగ్​ ద్వారా ఫీజును చెల్లించొచ్చు.

యూపీఎస్​సీ రిక్రూట్​మెంట్​కు ఇలా అప్లై చేసుకోండి..

స్టెప్​ 1:- యూపీఎస్​సీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS”ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

UPSC Recruitment 2023 apply online : స్టెప్​ 3:- అప్లికేషన్​ ఫామ్​ని ఫిల్​ చేయండి.

స్టెప్​ 4:- అప్లికేషన్​ ఫీజు చెల్లించండి

స్టెప్​ 5:- ప్రింటౌట్​ తీసుకోండి.

ఏపీ ఆర్జీయూకేటీలో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో రెగ్యులర్ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్ 20వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 220 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 20వ తేదీ సాయంత్రం 5గంటల లోపు అప్లై చేసుకోవచ్చని సూచించారు. అనంతరం అప్లికేషన్ తో పాటు అర్హత ధృవీకరణ పత్రాలను నవంబర్‌ 27 నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు పంపించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆంధ్రా వర్సిటీలో రిక్రూట్​మెంట్​..

Andhra University Recruitment 2023 : విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ 298 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 20 అని ప్రకటించింది. అభ్యర్థుల ధృవీకరణ పత్రాలతో పాటు అప్లికేషన్ హార్డ్ కాపీని నవంబర్ 27వ తేదీ లోపు ఆంధ్ర యూనివర్సిటీకి సమర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం