UPSC Recruitment 2023 : యూపీఎస్సీ రిక్రూట్మెంట్కు అప్లికేషన్ ప్రక్రియ షురూ.. వివరాలివే!
UPSC Recruitment 2023 : యూపీఎస్సీ రిక్రూట్మెంట్కు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది. ఆ వివరాలు..
UPSC Recruitment 2023 : అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లను స్వీకరిస్తోంది యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్). అప్లికేషన్ ప్రక్రియ శనివారం మొదలైంది. అర్హత గల అభ్యర్థులు.. నవంబర్ 3లోపు తమ అప్లికేషన్లను upsc.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దాఖలు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లోని వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2023:
ఈ దఫా రిక్రూట్మెంట్లో మొత్తం 25 పోస్టులను భర్తీ చేస్తోంది యూపీఎస్సీ. అవి..
అసిస్టెంట్ డైరక్టర్:- 2 పోస్టులు
UPSC Recruitment 2023 notification : అసిస్టెంట్ ప్రొఫెసర్:- 12 పోస్టులు
అసిస్టెంట్ ఆర్కిటెక్ట్:- 1 పోస్టు
డ్రిల్లర్-ఇన్-ఛార్జ్:- 6 పోస్టులు
ఇంజినీర్ అండ్ షిప్ సర్వేయర్/ డిప్యూటీ డైరక్టర్ జనరల్:- 3 పోస్టులు
షిప్ సర్వేయర్/ డిప్యూటీ డైరక్టర్ జనరల్:- 1 పోస్టు
అర్హత:- వివిధ పోస్టుల అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సెలక్షన్ ప్రక్రియ:- తొలుత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధించిన వారు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
UPSC Recruitment 2023 apply online : అప్లికేషన్ ఫీజు:- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఉచితం. ఇతరులకు ఫీజు రూ. 25. యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో చెల్లించవచ్చు.
ఐబీ రిక్రూట్మెంట్ 2023..
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఐబీలో అసిస్టెంట్ సెక్యూరిటీ, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mha.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొంది. మొత్తం 677 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 362 ఖాళీలు సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ పోస్టులు, 315 మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు కేటాయించారు.
ఈ ఐబీ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సెకండరీ స్కూల్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. సెక్యూరిటీ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కనీస వయోపరిమితి 18 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మల్టీ టాస్కింగ్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలుగా వెల్లడించారు. అన్‌రిజర్వ్‌డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు రూ. 50 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అక్టోబర్ 14 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నవంబర్ 13వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం