RGUKT Recruitment 2023 : ఏపీ ఆర్జీయూకేటీలో 220 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్- ఇలా అప్లై చేసుకోండి!
RGUKT Recruitment 2023 : ఏపీలోని ఆర్జీయూకేటీలో 220 రెగ్యులర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 20వ లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
RGUKT Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT)లో రెగ్యులర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 20వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 220 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 20వ తేదీ సాయంత్రం 5గంటల లోపు అప్లై చేసుకోవచ్చని సూచించారు. అనంతరం అప్లికేషన్ తో పాటు అర్హత ధృవీకరణ పత్రాలను నవంబర్ 27 నూజివీడులోని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్‌కు పంపించాలి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో లెక్చరర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.rgukt.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్జీయూకేటీ పోస్టుల వివరాలు :
లెక్చరర్లు - 220
ప్రొఫెసర్లు - 58
అసోసియేట్ ప్రొఫెసర్ల బ్యాక్‌లాగ్ ఖాళీలు - 19
అసోసియేట్ ప్రొఫెసర్లు - 84
అసిస్టెంట్ ప్రొఫెసర్ల బ్యాక్‌లాగ్ ఖాళీలు - 35
అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్ ఖాళీలు - 195
దరఖాస్తు రుసుము :
లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల పోస్టులకు అన్‌రిజర్వ్‌డ్/బీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ.2500, SC/ST/PBD అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ. 2000, భారతీయ ఓవర్సీస్ సిటిజన్స్ (OCI)ల దరఖాస్తు రుసుము రూ.4,200 అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ప్రొఫెసర్ పోస్టులుకు దరఖాస్తు రుసుము అన్ని కేటగిరీలకు రూ.3000, భారతీయ ఓవర్సీస్ సిటిజన్స్ కు దరఖాస్తు రుసుము రూ.12,600.
అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు రుసుము అన్ని కేటగిరీలకు రూ. 3000 కాగా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా దరఖాస్తు రుసుము రూ.8,400.
ఇలా దరఖాస్తు చేసుకోండి
ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 20 వరకు www.rgukt.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
అనంతరం అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని నవంబర్ 27 లోపు నూజివీడు ఆర్జీయూకేటీ చిరునామాకు పోస్టు, కొరియర్ ద్వారా పంపించాలి.
నూజివీడు ఆర్జీయూకేటీ చిరునామా
రిజిస్ట్రార్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, I-3 అడ్మినిస్ట్రేటివ్ భవనం, నూజివీడు క్యాంపస్, మైలవరం రోడ్, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 521202. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.rgukt.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
పరీక్షా విధానం
అభ్యర్థులకు 150 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. 180 నిమిషాల పాటు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కాగా తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్, ఇతర అంశాల వారీగా స్క్రీనింగ్ పరీక్షకు అర్హుల్ని నిర్ణయించి తుది జాబితాను డిసెంబర్ 12 లోపు విడుదల చేస్తారు. స్క్రీనింగ్, రాత పరీక్షకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు వేతనాల ఉన్నాయి.