తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Annual Calendar: 2025 ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసిన యూపీఎస్సీ; మే 25న సీఎస్ఈ ప్రిలిమ్స్

UPSC annual calendar: 2025 ఎగ్జామ్ క్యాలెండర్ ను విడుదల చేసిన యూపీఎస్సీ; మే 25న సీఎస్ఈ ప్రిలిమ్స్

HT Telugu Desk HT Telugu

26 April 2024, 15:11 IST

  • UPSC calendar: 2025 లో నిర్వహించే పరీక్షల తేదీల వివరాలతో ఎగ్జామ్ క్యాలెండర్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. ఆ క్యాలెండర్ ప్రకారం.. 2025 సంవత్సర యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025, మే 25వ తేదీన జరుగుతుంది. ఐఎఫ్ఎస్ ప్రిలిమ్స్ కూడా అదే రోజు జరుగుతుంది. 

యూపీఎస్సీ 2025 ఎగ్జామ్ క్యాలెండర్
యూపీఎస్సీ 2025 ఎగ్జామ్ క్యాలెండర్

యూపీఎస్సీ 2025 ఎగ్జామ్ క్యాలెండర్

UPSC annual exam calendar: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్యాలెండర్ ను అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్లో 2025 సంవత్సరంలో యూపీఎస్సీ వివిధ విభాగాల్లో నిర్వహించే రిక్రూట్మెంట్ పరీక్షలు, ఆ పరీక్షల షెడ్యూల్స్ ను పేర్కొంది.

జనవరి 11న తొలి పరీక్ష

2025 లో యూపీఎస్సీ (UPSC) నిర్వహించే తొలి పరీక్ష జనవరి 11వ తేదీన ఉంది. జనవరి 11, 2025 నుంచి రెండు రోజుల పాటు యూపీఎస్సీ ఆర్టీ / ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ తరువాత కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షను 2025 ఫిబ్రవరి 9న నిర్వహించనున్నారు. ఎన్ డీఏ, ఎన్ ఏ ఎగ్జామినేషన్ (ఐ) (N.D.A. & N.A. Examination (I)) 2025 తో పాటు, సీడీఎస్ ఎగ్జామినేషన్ (ఐ) (C.D.S. Examination (I), 2025) పరీక్షలను 2025 ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు.

సివిల్స్ ప్రిలిమ్స్ మే 25న..

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్ 2025 మే 25, 2025 న జరుగుతాయి. 2025 లో జరిగే అన్ని పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల చేసే తేదీని, దరఖాస్తుల స్వీకరణ తేదీలను వార్షిక క్యాలెండర్ లో యూపీఎస్సీ పేర్కొంది.

తదుపరి వ్యాసం