తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upi On Credit Cards : ఇక క్రెడిట్​ కార్డ్​లకు కూడా 'యూపీఐ'.. రెండు నెలల్లో!

UPI on credit cards : ఇక క్రెడిట్​ కార్డ్​లకు కూడా 'యూపీఐ'.. రెండు నెలల్లో!

Sharath Chitturi HT Telugu

23 July 2022, 8:47 IST

google News
    • UPI on credit cards : క్రెడిట్​ కార్డ్​లను యూపీఐకు లింక్​ చేసి.. లావాదేవీలను మొదలుపెట్టే ప్రక్రియ రెండు నెలల్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇక క్రెడిట్​ కార్డ్​లకు కూడా 'యూపీఐ'.. రెండు నెలల్లో!
ఇక క్రెడిట్​ కార్డ్​లకు కూడా 'యూపీఐ'.. రెండు నెలల్లో! (Mint)

ఇక క్రెడిట్​ కార్డ్​లకు కూడా 'యూపీఐ'.. రెండు నెలల్లో!

UPI on credit cards : యూపీఐ(యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​) నెట్​వర్క్​కు రూపే క్రెడిట్​ కార్డ్​లను లింక్​ చేసి.. రెండు నెలల్లో కార్యకలాపాలను మొదలు పెట్టే అవకాశం ఉందని ఎన్​పీసీఐ(నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా) వెల్లడించింది. శుక్రవారం జరిగిన బ్యాంక్​ ఆఫ్​ బరోడా ఈవెంట్​లో ఎన్​పీసీఐ చీఫ్​ దిలిప్​ ఆస్బే స్పష్టం చేశారు.

"బ్యాంక్​ ఆఫ్​ బరోడా కార్డ్​లు, ఎస్​బీఐ కార్డ్​లు, యాక్సిస్​ బ్యాంక్​, యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నాము. మరో 10రోజుల్లో మా ప్రతిపాదనలను ఆర్​బీఐకి పంపించే అవకాశం ఉంది. ఆర్​బీఐ నుంచి ఆమోదం లభిస్తే.. రెండు నెలల్లో కార్యకలాపాలను మొదలుపెట్టవచ్చు," అని అస్బే పేర్కొన్నారు.

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ)తో క్రెడిట్ కార్డులు కూడా లింక్ చేసేందుకు జూన్​ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించింది. ఈ పూర్తి ప్రక్రియతో మర్చెంట్​లకు ఎక్కువ లాభాలు ఉండే అవకాశం ఉండొచ్చు. జీరో మర్చెంట్​ డిస్కౌంట్​ రేట్​ను లబ్ధిపొందేందుకు.. మర్చెట్లు కార్డ్​లకన్నా యూపీఐలవైపే మొగ్గుచూపుతున్నారు. క్రెడిట్​ కార్డుల ద్వారా పేమెంట్​ చేస్తే.. మర్చెంట్ల నుంచి 2-3శాతం వరకు డబ్బులు కట్​ అవుతుంటాయి.

ప్రస్తుతం కేవలం సేవింగ్స్ అకౌంట్స్ లేదా కరెంట్ అకౌంట్స్‌తో లింక్ అయి ఉన్న యూపీఐ ఖాతాల ద్వారానే చెల్లింపులు జరపొచ్చు.

క్రెడిట్​ కార్డ్​కు యూపూఐ వెసులుబాటులో ఎక్కువ మంది ప్రజలు యూపీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా సులువుగా చెల్లింపులు చేస్తారని ఆర్‌బీఐ కూడా భావిస్తోంది.

దాదాపు 26 కోట్ల యూనిక్ యూజర్లు, 5 కోట్ల మంది మర్చెంట్లు ప్రస్తుతం యూపీఐ ప్లాట్‌ఫామ్ ఉపయోగిస్తున్నారు.

ఒక్క జూన్​లోనే యూపీఐ ద్వారా.. రూ. 10.14లక్షల కోట్లు విలువ చేసే లావాదేవీలు జరిగాయి!

టాపిక్

తదుపరి వ్యాసం