తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Russia Ukraine War: భారత్ పై కూడా ఆంక్షలు విధించాలి: ఉక్రెయిన్

Russia Ukraine war: భారత్ పై కూడా ఆంక్షలు విధించాలి: ఉక్రెయిన్

HT Telugu Desk HT Telugu

04 February 2023, 15:29 IST

  • Russia Ukraine war: పాశ్చాత్య ప్రపంచం సూచనలను పెడచెవిన పెట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ పై కూడా అమెరికా ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ కోరుతోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Russia Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) ప్రారంభమై సంవత్సరం పూర్తి కావొస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు. యుద్ధ (Russia Ukraine war) ప్రభావం ప్రపంచ దేశాల ఎకానమీ (world economy)పై తీవ్రంగా పడుతోంది. అమెరికా, యూరోప్ (europe) దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది.

Ukraine wants sanctions against India: ఇండియా పైనా ఆంక్షలు

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ మెరెజో (Oleksandr Merezhko) ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, రష్యాకు యుద్ధం (Russia Ukraine war) లో పరోక్షంగా సహకరిస్తున్న భారత్, చైనాలపై కూడా అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఆ ఎంపీ ఉక్రెయిన్ పార్లమెంట్లో కీలకమైన విదేశాంగ వ్యవహారాల కమిటీలో సభ్యుడు కూడా. భారత్, చైనాలు రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తున్నాయని, ఈ విషయంలో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల సూచనలను అవి పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అందువల్ల భారత్, చైనాలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో అది రష్యాకు ఆర్థికంగా సహాయపడుతోందని, దరిమిలా రష్యా యుద్ధ సన్నాహకాలకు ఉపయోగపడుతోందని వివరించారు. ఉక్రెయిన్ పై (Russia Ukraine war) యుద్ధంలో భారత్, చైనాలు రష్యాకు పరోక్షంగా సహాయపడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో, తైవాన్ తో సంబంధాలను పెంచుకోవాలని సూచించారు.

payments to Russia: చెల్లింపులెలా?

రష్యా (russia)పై అమెరికా (US), ఇతర జీ 8 (G 8) దేశాలు విధించిన ఆంక్షలను (sanctions) భారత్ గుర్తించడం లేదు. రష్యాతో వాణిజ్య, దౌత్య సంబంధాలను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఇది ఉక్రెయిన్, అమెరికా తదితర దేశాలకు నచ్చడం లేదు. మరోవైపు, డాలర్లలో చెల్లింపులకు సమస్యలు ఎదురయ్యే ముప్పు ఉన్నందున, రష్యా సొంతంగా అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. ప్రస్తుతానికి భారత్ చమురు కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను రష్యాకు యూఏఈ కరెన్సీ దిర్హామ్ (dirhams) ల్లో జరుపుతోంది. డాలర్లలో చెల్లింపులు జరపలేకపోవడం కొంతమేరకు ఇబ్బందికరమేనని భారత్ లోని రిఫైనరీలు, ట్రేడర్లు భావిస్తున్నారు.

టాపిక్