Cancel Tejashwi bail in IRCTC scam: ‘తేజస్వీ మా అధికారులను బెదిరించారు’
17 September 2022, 18:55 IST
- Cancel Tejashwi bail in IRCTC scam: IRCTC స్కామ్ కేసులో ప్రస్తుత బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కు మంజూరు చేసిన బెయిన్ ను రద్దు చేయాలని సీబీఐ ఢిల్లీలోని ఒక కోర్టును కోరింది.
బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
Cancel Tejashwi bail in IRCTC scam: IRCTC స్కామ్ లో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ శనివారం ఢిల్లీ లోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు.
Cancel Tejashwi bail in IRCTC scam: తేజస్వీకి నోటీసులు
సీబీఐ అభ్యర్థన మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు తేజస్వీ యాదవ్ కు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 28 లోపు స్పందించాలని ఆ నోటీసుల్లో తేజస్వీని ఆదేశించింది. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో.. సీబీఐ అధికారులను బెదిరించేలా తేజస్వీ మాట్లాడారని సీబీఐ కోర్టుకు తెలిపింది. IRCTC హోటళ్ల మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో జరిగిన అవినీతికి సంబంధించిన కేసును సీబీఐ విచారించింది. ఈ కేసులో తేజస్వీ యాదవ్ కు, ఆయన తల్లి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవికి 2018 ఆగస్ట్ లో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో 12 మంది వ్యక్తులు, రెండు కంపెనీలపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. రాంచిలో, ఒడిశాలోని పురిలో ఉన్న IRCTC హోటళ్ల మెయింటనెన్స్ కాంట్రాక్ట్ కు సంబంధించి అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తోంది. 2006లో ఈ కాంట్రాక్ట్ ను ఇచ్చినందుకు గానూ తేజస్వీ కుటుంబం పట్నా లోని ప్రైమ్ లొకేషన్ లో మూడు ఎకరాల ప్లాట్ ను లంచంగా పొందారన్నది సీబీఐ ప్రధాన ఆరోపణ. ఇదే కేసుకు సంబంధించి ఈడీ కూడా చార్జిషీట్ నమోదు చేసింది.
టాపిక్