Udhayanidhi Stalin becomes Minister: మరో వారసుడికి మంత్రి పదవి
14 December 2022, 18:50 IST
Udhayanidhi Stalin becomes Minister: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
గవర్నర్ రవితో ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin becomes Minister: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, నటుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం రాష్ట్ర మంత్రిగా కొత్త బాధ్యతలను చేపట్టారు.
Stalin oathtaking ceremony: రాజ్ భవన్ లో నిరాడంబరంగా..
ఉదయనిధి స్టాలిన్ బుధవారం ఉదయం చెన్నైలోని రాజ్ భవన్ లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం స్టాలిన్, పలువురు కేబినెట్ మంత్రులు హాజరయ్యారు. స్టాలిన్ కుటుంబానికి చెందిన ఎంపీ కణిమొళి, అళగిరి ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. తను రెగ్యులర్ గా వేసుకునే బ్లూ డెనిమ్ జీన్స్, డీఎంకే యువజన విభాగం సింబల్ ఉన్న చెక్స్ వైట్ షర్ట్ ను ధరించి ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Sports minister: క్రీడల శాఖ మంత్రి
ఉదయ నిధి స్టాలిన్ కు క్రీడలు, యువజన సంక్షేమం, స్పెషల్ ప్రొగ్రామ్ ఇంప్లిమెంటేషన్, పేదరిక నిర్మూలన తదితర శాఖలను అప్పగించారు. అలాగే, మంత్రివర్గంలోని మరో 10 మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చేశారు. ఉదయ నిధి స్టాలిన్ 2021లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు పార్టీ యువజనన విభాగం బాధ్యతలను నిర్వర్తించారు. స్టాలిన్ కూడా మొదట్లో తండ్రి కరుణానిధి నీడలో రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో. . పార్టీ యువజన బాధ్యతలనే చూసుకున్నారు. దాదాపు 3 దశాబ్దాల పాటు ఆయన ఆ బాధ్యతలను నిర్వర్తించారు.
stalin`s last movie: చివరి సినిమా ‘మామన్నన్’
రాజకీయాలు, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించడం కోసం పూర్తి స్థాయి సమయం కేటాయిస్తానని ప్రమాణ స్వీకారం అనంతరం ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ప్రస్తుతం తాను చేస్తున్న ‘మామన్నన్’ తన చివరి సినిమా అని వెల్లడించారు. ఉదయనిధికి మంత్రి పదవి ఇవ్వడం వారసత్వ రాజకీయాలని అన్నా డీఎంకే విమర్శించడంపై స్పందిస్తూ.. అలాంటి విమర్శలు వినీవినీ ఉన్నానని, తన పనితోనే వారికి సమాధానమిస్తానని స్పష్టం చేశారు. 2021 ఎన్నికల్లో తన తాత కరుణానిధికి కంచుకోట వంటి చెపాక్ తిరువెళ్లికేని నియోజకవర్గం నుంచి ఉదయనిధి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా బాద్యతలు చేపట్టిన ఉదయనిధికి రజినికాంత్, కమల్ హాసన్ సహా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.