Swara Bhasker marriage: ‘సమాజ్ వాదీ’ నేతను పెళ్లి చేసుకోనున్న నటి స్వర భాస్కర్
08 January 2024, 20:20 IST
Swara Bhasker marriage: ఎట్టకేలకు తను ఎవరితో డేటింగ్ లో ఉందో నటి స్వర భాస్కర్ (Swara Bhasker) వెల్లడించారు. త్వరలో తాము వివాహం చేసుకోబోతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
స్వర భాస్కర్ షేర్ చేసుకున్న ఫొటోలు
Swara Bhasker marriage: నటి, యాక్టివిస్ట్ స్వర భాస్కర్ (Swara Bhasker) ఎట్టకేలకు తన కాబోయే లైఫ్ పార్ట్ నర్ ఎవరో రివీల్ చేశారు. కొన్నాళ్లుగా తను, సమాజ్ వాదీ యువజన విభాగం అధ్యక్షుడు ఫహాద్ అహ్మద్ (SP Leader Fahad Ahmad) రిలేషన్ షిప్ లో ఉన్నామని వెల్లడించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు.
Swara Bhasker marriage: టైమ్ లైన్ సహా సోషల్ మీడియాలో..
సమాజ్ వాదీ యువజన విభాగం అధ్యక్షుడు ఫహాద్ అహ్మద్ (SP Leader Fahad Ahmad) తనకు పరిచయం అయిన నాటి నుంచి, తమ మధ్య జరిగిన ముఖ్య ఘటనలకు సంబంధించిన వివరాలతో కూడిన టైమ్ లైన్ ను కూడా స్వర భాస్కర్ ట్విటర్ (twitter) లో పోస్ట్ చేశారు. ఢిల్లీ నిరసనల సమయంలో ఫహాద్ అహ్మద్ తో తనకు పరిచయమైందని, ఆ తరువాత పలు సందర్బాల్లో కలుసుకుని, చాలా విషయాలపై చర్చలు జరిపేవారమని ఆమె వెల్లడించారు. తామిద్దరం కలిసి ఒక పిల్లిని కూడా అడాప్ట్ చేసుకున్నామని, తాజాగా, కలిసి జీవితం పంచుకోవాలని గత నెలలో నిర్ణయించుకున్నామని వివరించారు. తమ లైఫ్ లోని ఎమోషనల్ మూమెంట్స్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎంతో హృద్యంగా ఎడిట్ చేసి, ఒక వీడియో రూపొందించి, ట్విటర్ (twitter) లో స్వర భాస్కర్ పోస్ట్ చేశారు.
Swara Bhasker marriage: వైరల్ గా వీడియో
స్వర భాస్కర్ ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. వందలాది అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో స్వర భాస్కర్ సహ నటుడు, రచయిత హిమాంషు శర్మతో రిలేషన్ లో ఉందని, ఆ తరువాత 2019లో వారి మధ్య బ్రేకప్ అయిందని వార్తలు వచ్చాయి. స్వర భాస్కర్ (Swara Bhasker) చివరగా జహా చార్ యార్ (Jahaan Chaar Yaar) అనే సినిమాలో కనిపించారు. ఈ సినిమా 2022సెప్టెంబర్ లో విడుదల అయింది.