Article 370 : ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ
11 July 2023, 11:52 IST
- ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై.. ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం వెల్లడించింది.
సుప్రీంకోర్టు
Supreme court hearing on Article 370 abrogation : జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి విచారించనుంది సుప్రీంకోర్టు. సంబంధిత వ్యాజ్యాలపై రోజువారీ విచారణ చేపట్టనున్నట్టు మంగళవారం ప్రకటించింది సర్వోన్నత న్యాయస్థానం.
వారి పేర్లు తొలగింపు..
"ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 2 ఉదయం 10:30 గంటల నుంచి విచారణ జరుపుతుంది. సోమ, శుక్ర మినహించి.. రోజువారీ పద్ధతిలో విచారణ జరుగుతుంది," అని భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. 2019 ఆగస్టులో భారత పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టానికి కూడా ఆమోద ముద్రవేసింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించాయి. అనంతరం జమ్ముకశ్మీర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు వెలుగులోకి వచ్చింది.
Article 370 abrogation Supreme court : ఆ తర్వాత.. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అప్పట్లో విచారణ జరిపింది అత్యున్నత న్యాయస్థానం. తిరిగి.. మూడేళ్ల తర్వాత ఆగస్టు 2 నుంచి విచారణను కొనసాగించనుంది.
‘సరైన నిర్ణయమే తీసుకున్నాము..’
ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా గతంలో వ్యాజ్యలు దాఖలు చేసిన ఐపీఎస్ అధికారి షా బైజల్, సామాజిక కార్యకర్త షెహ్లా రషీద్‌లు.. తమ పేర్లను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనలను సుప్రీంకోర్టు తాజాగా అంగీకరించింది.
Supreme court latest news : మరోవైపు జమ్ముకశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ మేరకు సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. టెర్రర్ నెట్‌వర్క్‌పై సమర్థమైన పోరాటానికి తమ నిర్ణయం ఉపయోగపడిందని వెల్లడించింది. వీధుల్లో హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని, రాళ్లు రువ్వే ఘటనలు పూర్తిగా కనుమరుగైపోయాయాని పేర్కొంది.