తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ssc New Website: అలర్ట్.. అందుబాటులోకి ఎస్ఎస్సీ కొత్త వెబ్ సైట్; ఇందులో నుంచే అప్లై చేసుకోవాలి..

SSC New Website: అలర్ట్.. అందుబాటులోకి ఎస్ఎస్సీ కొత్త వెబ్ సైట్; ఇందులో నుంచే అప్లై చేసుకోవాలి..

HT Telugu Desk HT Telugu

03 April 2024, 19:45 IST

google News
  • SSC New Website: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే పరీక్షలు రాసే అభ్యర్థులకు కీలక గమనిక. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు మరొక కొత్త వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై అభ్యర్థులు ssc.gov.in ద్వారా కూడా నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Deepak Gupta/HT photo)

ప్రతీకాత్మక చిత్రం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో తమ వెబ్ సైట్ కు సంబంధించి చేసిన కీలక మార్పులు, ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ 2024 దరఖాస్తు మార్గదర్శకాలు తదితర వివరాలను వెల్లడించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కు కొత్త వెబ్ సైట్ ssc.gov.in అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. అలాగే, ఇప్పటివరకు ఉన్న వెబ్ సైట్ ssc.nic.in కూడా అందుబాటులోనే ఉంటుందని స్పష్టం చేసింది.

నోటిఫికేషన్ కొత్త వెబ్ సైట్ లోనే..

ఎస్ఎస్సీ సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ 2024 ను కొత్త వెబ్సైట్ ssc.gov.in లోనే విడుదల చేస్తామని, అభ్యర్థులు ఈ కొత్త ssc.gov.in వెబ్సైట్ ద్వారానే తమ దరఖాస్తు ఫారాలను సమర్పించాలని ఎస్ఎస్సీ తెలిపింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ను కొత్త వెబ్సైట్ ssc.gov.in లో జనరేట్ చేయాల్సి ఉంటుంది. గత వెబ్సైట్ ssc.nic.in లో జనరేట్ చేసిన ఓటీఆర్.. కొత్త వెబ్ సైట్ లో పనిచేయదు. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్, 2024 నోటిఫికేషన్ విడుదలకు ముందే అభ్యర్థులు వీలైనంత త్వరగా ఓటీఆర్ పూర్తి చేసుకోవాలని ఆ ప్రకటనలో ఎస్ఎస్సీ (SSC) తెలిపింది.

లైవ్ ఫొటో కాప్చరింగ్

ఎస్ఎస్సీ (SSC) కొత్త వెబ్సైట్ ssc.gov.in లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు, అభ్యర్థుల లైవ్ ఫోటోలను క్యాప్చర్ (live photograph capture) చేసే అవకాశం ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. మునుపటి వెబ్సైట్లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయడంలో, కొత్త వెబ్ సైట్ లో అప్లికేషన్ ను సబ్మిట్ చేయడంతో కొన్ని తేడాలున్నాయి. కొత్త SSC వెబ్ సైట్ ssc.gov.in లో దరఖాస్తు ప్రక్రియలో భాగంగా లైవ్ ఫొటో (live photo) క్యాప్చర్ చేస్తారు. లైవ్ ఫొటోను క్యాప్చర్ చేయడానికి అభ్యర్థులు కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో వెబ్ క్యామ్ లేదా ఆండ్రాయిడ్ డివైజ్ ను ఉపయోగించవచ్చు.

లైవ్ ఫొటో కాప్చర్ చేసేముందు ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..

  • మంచి వెలుతురు, స్పష్టమైన నేపథ్యం ఉన్న ప్రదేశంలో కూర్చుని లైవ్ ఫొటో (live photo) తీసుకోండి.
  • ఫోటో తీయడానికి ముందు కెమెరా మీ కంటికి సమాన ఎత్తులో ఉందని నిర్ధారించుకోండి.
  • వెబ్ క్యామ్ ముందు సరిగ్గా కూర్చుని, నిటారుగా ముందుకు చూడండి.
  • లైవ్ ఫోటో (live photo) తీసుకునేటప్పుడు అభ్యర్థులు టోపీ, మాస్క్ లేదా కళ్లజోడు వంటివి ధరించకూడదు.

తదుపరి వ్యాసం