తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Monsoon Ends Today : దేశంలో నేటితో నైరుతి రుతుపవనాల ముగింపు..!

Monsoon ends today : దేశంలో నేటితో నైరుతి రుతుపవనాల ముగింపు..!

Sharath Chitturi HT Telugu

30 September 2022, 6:36 IST

google News
    • Southwest Monsoon ends today : నేటితో దేశంలో నైరుతి రుతుపవనాలకు అధికారికంగా ముగింపు పడనుంది. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది.
నేటితో నైరుతి రుతుపవనాలకు ముగింపు
నేటితో నైరుతి రుతుపవనాలకు ముగింపు (HT_PRINT)

నేటితో నైరుతి రుతుపవనాలకు ముగింపు

Southwest Monsoon ends today : నేటితో నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా అధికారికంగా ముగియనుంది! మొత్తం మీద ఈ ఏడాది.. 7శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా 2022 రుతుపవనాల సీజన్​ను సగటు కన్నా అధిక వర్షపాతంగా పరిగణించవచ్చు అని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది.

2021లో ఎల్​పీఏ(లాంగ్​ పీరియడ్​ యావరేజ్​)లో 99శాతం వర్షపాతం నమోదైంది. దానిని సాధారణ రుతుపవనాలుగా పరిగణించారు. ఇక 2020లో ఎల్​పీఏలో 109శాతం వర్షపాతం నమోదుకావడంతో దానిని సాధారణం కన్నా ఎక్కువ అని పరిగణించారు. ఇక 2019లో అది 110శాతంగా ఉంది.

End of monsoon season : నైరుతి రుతుపవనాలు..

ఈ ఏడాది రుతుపవనాల విషయంలో కాస్త భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. సాధారణంగా సెప్టెంబర్​ చివర్లో వర్షాలు ఎక్కువగా పడవు. కానీ ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సెప్టెంబర్​ చివరి రెండు వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుశాయి. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్​లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇంత జరిగినా.. తూర్పు, ఈశాన్య భారతంలో మాత్రం 18శాతం లోటు వర్షపాతం నమోదుకావడం గమనార్హం. వాయువ్య భారతంలో 1శాతం ఎక్కువ వర్షపాతం, మధ్య భారతంలో 19శాతం అధికం, భారత ద్వీపకల్పంలో 22శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వివరాలను ఐఎండీ వెల్లడించింది.

Southwest monsoon in India : బిహార్​లో అత్యధికంగా 31శాతం, ఉత్తర్​ప్రదేశ్​లో 28శాతం, ఝార్ఖండ్​లో 21శాతం, మణిపూర్​లో 47శాతం, మిజోరాంలో 22శాతం, త్రిపురలో 24శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పంటలు సరిగ్గా చేతికి అందలేదు! రష్యా ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా పెరిగిపోయిన ఆహార ద్రవ్యోల్బణంతో పాటు ఇది మరింత ప్రతికూలంగా మారింది.

Rains in India : ఎల్​పీఏలో 90శాతం దిగువన వర్షపాతం నమోదైతే దానిని లోటు అని అంటారు. 90-96శాతం మధ్యలో వర్షపాతం ఉంటే దానిని సాధారణం కన్నా తక్కువ అని పరిగణిస్తారు. 96-104శాతంగా ఉంటే దానిని సాధారణంగాను, 104-110శాతంగా ఉంటే అప్పుడు దానిని సాధారణం కన్నా ఎక్కువగాను గుర్తిస్తారు. ఇక 110శాతం కన్నా ఎక్కువగా ఉంటే.. దానిని అధిక వర్షపాతం అని అంటారు.

గురువారం నాటికి పంజాబ్​, ఛండీగఢ్​, ఢిల్లీ, జమ్ముకశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణా, రాజస్థాన్​ల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి మళ్లాయి అని ఐఎండీ స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం