Shiv Sena news: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురు దెబ్బ; ఠాక్రే వర్గానికి షాకిచ్చిన ఈసీ
17 February 2023, 20:21 IST
Shiv Sena news: పార్టీలో తిరుగుబాటుతో మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన శివసేన (Shiv Sena) నేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) కు శుక్రవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ఉద్ధవ్ ఠాక్రే
Shinde faction gets Shiv sena name: పేరు, గుర్తు షిండేదే..
ఈ నేపథ్యంలో శివసేన (Shiv Sena) పార్టీ పేరు, పార్టీ గుర్తు ఎవరికి చెందాలనే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నది. ఇటు ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం, అటు ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) వర్గం సుప్రీంకోర్టును, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాయి. తాజాగా, ఎన్నికల సంఘం ఈ వివాదంపై కీలక ఆదేశాలను వెలువరించింది. శివసేన (Shiv Sena) పార్టీ పేరుతో పాటు, పార్టీ గుర్తు అయిన విల్లంబులు (bow and arrow) ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) వర్గానికే చెందుతాయని శుక్రవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ఆదేశాలు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద ఎదురు దెబ్బ అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు.. శివసేన (Shiv Sena) నుంచి గెలిచిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేలకు లభించిన మొత్తం ఓట్లలో 23.5% ఓట్లు మాత్రమే వచ్చాయని, మిగతా 76.5% ఓట్లు షిండే వర్గంలోని ఎమ్మెల్యేలకు వచ్చాయని, అందువల్ల పార్టీ పేరు, పార్టీ గుర్తు అయిన విల్లంబులు షిండే (Eknath Shinde) వర్గానికే చెందుతాయని నిర్ణయించామని ఎన్నికల సంఘం వివరించింది. గత అక్టోబర్ లో తాత్కాలికంగా ఉద్ధవ్ వర్గానికి కాగడా గుర్తును, ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే’ అనే పేరును ఎన్నికల సంఘం కేటాయించింది.
Shinde reaction: షిండే హ్యాపీ..
ఎన్నికల సంఘం ఆదేశాలపై మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) సంతోషం వ్యక్తం చేశారు. తమదే అసలైన శివసేన (Shiv Sena) అని ఎన్నికల సంఘం గుర్తించడం సంతోషకరమన్నారు. బాలాసాహెబ్ రాజకీయ వారసత్వానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. మరోవైపు, ఎన్నికల సంఘం నిర్ణయం ఊహించేదనని Shiv Sena ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘంపై తమకు విశ్వాసం ఏనాడో పోయిందన్నారు.