తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sharad Pawar : శరద్ పవార్ యూ టర్న్; రాజీనామా నిర్ణయం వెనక్కు

Sharad Pawar : శరద్ పవార్ యూ టర్న్; రాజీనామా నిర్ణయం వెనక్కు

HT Telugu Desk HT Telugu

05 May 2023, 19:09 IST

  • Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన శరద్ పవార్ (Sharad Pawar).. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వెనక్కు తగ్గారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

శరద్ పవార్
శరద్ పవార్ (HT Photo/Anshuman Poyrekar)

శరద్ పవార్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన శరద్ పవార్ (Sharad Pawar).. పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వెనక్కు తగ్గారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు.

Sharad Pawar: సెంటిమెంట్స్ ను గౌరవించి..

దేశ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ (Sharad Pawar) కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల పాటు ఉన్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ మరాఠా నాయకుడు కాంగ్రెస్ లో అనేక కీలక పదవులు చేపట్టారు. అనంతరం, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వంతంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) ని స్థాపించారు. ఇటీవల పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఈ నిర్ణయంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హతాశులయ్యారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శరద్ పవార్ (Sharad Pawar) పై ఒత్తిడి చేశారు. దాంతో NCP చీఫ్ పదవి నుంచి వెైదొలగాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఆయన వాయిదా వేసుకున్నారు. ‘మీ సెంటిమెంట్స్ ను అగౌరవపర్చలేను. మీ ప్రేమాభిమానాల కారణంగా, మీ డిమాండ్ కు తలొగ్గి నా రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాను’’ అని శరద్ పవార్ శుక్రవారం పార్టీ కార్యకర్తలు, నేతలనుద్ధేశించి ఒక ప్రకటన చేశారు.

Sharad Pawar: అజిత్ పవార్ సంక్షోభం

అంతకుముందు, శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎన్సీపీ (NCP) నాయకులు ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ సీనియర్ నాయకుడు అజిత్ పవార్ (Ajit Pawar) నాయకత్వంలో కొందరు ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీలో చేరనున్నారనే వార్తల మధ్య అకస్మాత్తుగా శరద్ పవార్ ఎన్సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేశారన్న వార్త సంచలనం సృష్టించింది. ఎన్సీపీ (NCP) నాయకులు, కార్యకర్తలను షాక్ కు గురి చేసింది.