తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sex Racket : ఆ వ్యభిచార గృహానికి ఓనర్​ 17ఏళ్ల బాలిక! పక్కా ప్లాన్​తో..!

Sex racket : ఆ వ్యభిచార గృహానికి ఓనర్​ 17ఏళ్ల బాలిక! పక్కా ప్లాన్​తో..!

Sharath Chitturi HT Telugu

10 November 2023, 8:13 IST

google News
    • Sex racket busted in Navi Mumbai : వ్యభిచార గృహం నడుపుతున్న ఓ 17ఏళ్ల బాలికను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇందుకోసం పోలీసులు ఓ ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టారు.
ఆ వ్యభిచార గృహానికి ఓనర్​ 17ఏళ్ల బాలిక! పక్కా ప్లాన్​తో..!
ఆ వ్యభిచార గృహానికి ఓనర్​ 17ఏళ్ల బాలిక! పక్కా ప్లాన్​తో..!

ఆ వ్యభిచార గృహానికి ఓనర్​ 17ఏళ్ల బాలిక! పక్కా ప్లాన్​తో..!

Mumbai Sex racket : ముంబైలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్స్​ రాకెట్​ను పోలీసులు గుర్తించారు. కాగా.. ఆ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నది 17ఏళ్ల బాలిక!

ఇదీ జరిగింది..

అంధేరీలో ఫ్యాషన్​ డిజైనింగ్​ చేస్తున్న 17ఏళ్ల బాలిక.. గత కొంతకాలంగా వ్యభిచార గృహం నడుపుతోంది. కానీ ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియదు. తమ బిడ్డ.. చదువుకు ఫీజు కట్టుకునేందుకు పార్ట్​ టైమ్​ జాబ్​ చేస్తోందని వారు అనుకునే వారు.

కానీ ఆ బాలిక.. నలుగురు మోడల్స్​తో నవీ ముంబైలో వ్యభిచారం చేసేది. డేటింగ్​ యాప్స్​లో కస్టమర్లకు గాలం వేసేది. తొలుత వారితో మామూలుగా చాట్​ చేసేది. తన మీద నమ్మకం పెరిగిన తర్వాత.. అసలు విషయానికి వచ్చేది. అలా.. వారికి సెక్స్​ సర్వీస్​ ఇచ్చేది. ఒక్కొక్కరి నుంచి కనీసం రూ. 50వేలు తీసుకునేది. ఇలా వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని ఆ మోడల్స్​కు ఇచ్చి, మిగిలినవి దాచుకునేది.

Mumbai crime news : కాగా.. ఈ సెక్స్​ రాకెట్​ విషయంపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ కేసును ఛేదించాలని నిర్ణయించుకున్న పోలీసులు.. ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టారు. చివరికి బాలికను పట్టుకున్నారు.

"బాలిక దగ్గర నలుగురు మోడల్స్​ ఉన్నారు. వారి వయస్సు 20, 21, 24, 30. గతంలో వారు సీరియల్స్​లో చిన్నచిన్న పాత్రలు చేసేవారు. మేము డేటింగ్​ యాప్​లో బాలికతో చాట్​ చేశాము. పోలీసులము అని తెలియకుండా.. ఒక కస్టమర్​గా సంప్రదించాము. కొన్ని రోజులకు ఆమె అసలు విషయానికి వచ్చింది. మోడల్స్​కు సంబంధించిన న్యూడ్​ ఫొటోలు పంపి, రేట్లు చెప్పింది. నలుగురు పురుషుల కోసం సర్వీస్​ కావాలని అడిగాము. ఒక్కొక్కరికి రూ. 50వేలు చెప్పింది. కానీ రూ. 30వేలు అడిగాము. అలా.. రూ. 1.20లక్షలకు ఫిక్స్​ చేసింది. ఇదంతా.. ఆమెకు మా మీద అనుమానం రాకుండా ఉండేందుకే చేశాము. మంగళవారం నాడు.. సత్రా ప్లాజ్​కు సమీపంలోని ఓ హోటల్​కు రావాలని పిలిచాము. అక్కడ ఆ నలుగురు మోడల్స్​ని ఆమె తీసుకొచ్చింది. అందరిని పట్టుకున్నాము," అని పోలీసులు వెల్లడించారు.

Sex racket busted in Navi Mumbai : నలుగురు మోడల్స్​ని రీహాబిలేషన్​ సెంటర్​కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. నిందితురాలు మైనర్​ కావడంతో ఆమెను జువెనైల్​ హోమ్​కు తరలించినట్టు స్పష్టం చేశారు. ఆమెను విచారించగా.. "జీవితాన్ని సాగించేందుకు చేయక తప్పలేదు," అని ఆమె చెప్పినట్టు పోలీసులు వివరించారు.

ఈ ఘటనపై సెక్షన్​ 370 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

తదుపరి వ్యాసం